Movie News

మామకు పొంగల్ – అల్లుడికి తండేల్

జనవరిలో సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ 300 కోట్ల ఇండస్ట్రీ హిట్ సాధించడం అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సహాన్ని ఇచ్చింది. సీనియర్ స్టార్లలో వెనుకబడిపోతున్నాడన్న భయాన్ని పూర్తిగా పోగొడుతూ ఇంత ఘనవిజయం సాధించడం ఎవరూ ఊహించలేదు. ఇట్స్ బ్లాక్ బస్టర్ పొంగల్ అనే పాటకు తగ్గట్టు వెంకీ మామ వసూళ్ల వర్షం ఇరవై రోజుల తర్వాత కూడా కొనసాగుతోంది. వీకెండ్స్ ఫ్యామిలీ ఛాయస్ ఇదే సినిమా అవుతోంది. మామా ఆనందాన్ని ఇలా ఆస్వాదిస్తుండానే మేనల్లుడు నాగచైతన్య తాజాగా తండేల్ తో వచ్చాడు. కొంత మిక్స్డ్ టాక్ నడుస్తున్న ఓవరాల్ గా వసూళ్లు బాగుండటం హిట్ దిశగా తీసుకెళ్తోంది.

మొదటి రోజు పాతిక కోట్లకు దగ్గరగా వెళ్లిన చైతు వంద కోట్ల గ్రాసర్ అందుకోవడం ఖాయమనే మాట ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కంటెంట్ పరంగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ జనాలు రాజు, సత్యల ప్రేమకథకు కనెక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవిల కెమిస్ట్రీ లవ్ స్టోరీ తర్వాత మరింత బాగా తండేల్ లో పండింది. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆడియన్స్ ని మెప్పిస్తోంది. దీనికి పోటీగా వచ్చిన తమిళ డబ్బింగ్ పట్టుదల మొదటి ఆటకే చేతులు ఎత్తేయగా బాలీవుడ్ రిలీజులు బ్యాడ్ ఆస్ రవికుమార్, లవ్ యాపా కనీస ప్రభావాన్ని చూపించలేకపోయాయి. సో తండేల్ దే రాజ్యం.

వచ్చే వారం విశ్వక్ సేన్ లైలా మినహా ఇంకో పదిహేను రోజుల దాకా చెప్పుకోదగ్గ రిలీజ్ లేకపోవడాన్ని తండేల్ ఎలా వాడుకుంటుందో చూడాలి. ఇదే మూమెంట్ ని కొనసాగిస్తే చైతు కెరీర్ బెస్ట్ నమోదవ్వడం ఖాయం. రేపటి నుంచి వీక్ డేస్ లో డ్రాప్ ఎంత శాతంలో ఉంటుందనేది కీలకంగా మారింది. ఏపిలో టికెట్ రేట్ల పెంపుకి వెళ్లడం కొంత ప్రభావం చూపిస్తున్నప్పటికీ దాన్ని వారం రోజులకు పరిమితం చేయడంతో మరీ ఆందోళన అవసరం లేదని బయ్యర్స్ టాక్. మొత్తానికి మామ పొంగల్ నాదే అనిపిస్తోంది తాజాగా మేనల్లుడు ఫిబ్రవరి నాదే అంటూ తండేల్ తో వర్కౌట్ చేసుకునేలా ఉన్నాడు. సో ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీ.

This post was last modified on February 9, 2025 11:42 am

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

26 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago