Movie News

తొలి సీజన్‌కు 40 లక్షలు.. రెండో సీజన్‌కు 20 కోట్లు?

సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావడం ఒకెత్తయితే.. తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే కెరీర్ మలుపు తిరుగుతుంది. స్టార్ స్టేటస్ సంపాదించేస్తారు. కొందరు మాత్రం చాలా ఏళ్ల పాటు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేస్తుంటారు. బ్రేక్ రావడానికి టైం పడుతుంది. ఆ బ్రేక్ వచ్చినపుడు వారి అన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కుతుంది. దశ మారిపోతుంది.

బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్‌కు ‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్ అలాంటి మలుపే అయింది. ఈ సిరీస్ చేయడానికి ముందు ‘విశ్వరూపం’ సహా పలు చిత్రాల్లో నటించాడు జైదీప్. నటుడిగా కొంచెం పేరొచ్చింది కానీ.. కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. ఐతే చిన్న స్థాయి నటుడు అని చూడకుండా ‘పాతాళ్ లోక్’లో జైదీప్‌కు లీడ్ రోల్ చేసే అవకాశం ఇచ్చారు దాని మేకర్స్.

అమేజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమ్ అయిన ఆ సిరీస్ బ్లాక్ బస్టర్ అయింది. జైదీప్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.‘పాతాళ్ లోక్’తో జైదీప్ బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. అదే సమయంలో ఈ సిరీస్‌కు కొనసాగింపుగా తీసిన ‘పాతాళ్ లోక్-2’లోనూ నటించాడు. గత నెలలోనే స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండో సీజన్‌ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో జైదీప్ పాపులారిటీ ఇంకా పెరిగింది.

విశేషం ఏంటంటే.. ‘పాతాళ్ లోక్’ తొలి సీజన్‌కు అతను కేవలం రూ.40 లక్షల పారితోషకమే తీసుకున్నాడట. ఇలాంటి ఓ సిరీస్‌లో తనకు అవకాశం రావడమే గొప్ప అని పారితోషకం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సిరీస్ అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టింది. రెండో సీజన్‌కు తన రెమ్యూనరేషన్ ఎకంగా 50 రెట్లు పెరిగిందని హిందీ మీడియా టాక్.

బాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లకు దీటుగా రూ.20 కోట్ల పారితోషకం పుచ్చుకున్నాడని వినికిడి. తొలి సీజన్ చూసిన వాళ్లు కథ కోసమే కాక.. జైదీప్ కోసం సెకండ్ చూస్తున్నారనడంలో సందేహం లేదు. కాబట్టి అతడికీ రెమ్యూనరేషన్ ఇవ్వడం పూర్తిగా సమంజసం అనే చెప్పాలి.

This post was last modified on February 8, 2025 7:48 pm

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

57 minutes ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

1 hour ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

6 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

8 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

10 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

11 hours ago