అంతా అనుకున్నట్లు జరిగితే నితిన్ కొత్త చిత్రం రాబిన్ హుడ్ ఎప్పుడో రిలీజైపోయి ఉండాలి క్రిస్మస్‌కు అనుకున్న ఆ చిత్రం కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఒక దశలో సంక్రాంతి రిలీజ్ అన్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. వేసవి సీజన్‌ను ఆరంభిస్తూ మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు చివరగా కొన్ని వారాల కిందటే ప్రకటించారు. కానీ అదే రోజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు షెడ్యూల్ అయి ఉండడంతో అయోమయం తప్పలేదు.
పవన్‌కు వీరాభిమాని అయిన నితిన్.. తన ఆరాధ్య కథానాయకుడి సినిమాకు పోటీగా తన చిత్రాన్ని రిలీజ్ చేస్తాడని ఎవ్వరూ భావించడం లేదు. దీన్ని బట్టి పవన్ సినిమా మార్చి 28న రాదని ఫిక్సయిపోయారు అందరూ. కానీ గత కొన్ని రోజులుగా హరిహర వీరమల్లు అప్‌డేట్స్‌తో ఊరిస్తోంది. ఇటీవలే నిర్మాత ఏఎం రత్నం సైతం తమ చిత్రాన్ని మార్చి 28నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
హరిహర వీరమల్లు షూట్ గురించి కూడా ఇటీవలే అప్‌డేట్ బయటికి వచ్చింది. పవన్ మీద వారం రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని.. ఆ షెడ్యూల్ కోసం పవన్ కాల్ షీట్స్ కూడా ఇచ్చాడని వార్తలు వచ్చాయి. దీంతో హరిహర వీరమల్లు మార్చి 28కి వస్తుందని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అదే నిజమైతే నితిన్ సినిమా ఆటోమేటిగ్గా రేసు నుంచి తప్పుకుంటుందని భావిస్తున్నారు.
కానీ రాబిన్ హుడ్ రిలీజ్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు తగ్గట్లేదు. తాజాగా 50 రోజుల రిలీజ్ కౌంట్ డౌన్‌తో ఒక పోస్టర్ వదిలారు. సినిమా థియేటర్లలో ఈ సినిమా టీజర్‌ను ప్రదర్శిస్తూ ప్రమోషన్ల సందడి కూడా ఆరంభించారు. మరి పవన్ సినిమా వస్తుందని తెలిసే నితిన్ పోటీకి సై అంటున్నాడా.. లేక పవన్ సినిమా మార్చి 28 రాదన్న ధీమానా అన్నది అర్థం కావడం లేదు.
నితిన్‌తో పాటు మైత్రీ అధినేతలు కూడా పవన్‌కు అత్యంత సన్నిహితులే. కాబట్టి ఆయన సినిమాతో పోటీకి వెళ్లే రకమైతే కాదు. మరి వాళ్ల ఉద్దేశం ఏంటన్నది ఆసక్తికరం. హరిహర వీరమల్లు వాయిదా పడుతుందనే నమ్మకంతోనే ఇలా చేస్తుండొచ్చు. అదే జరిగితే తమ సినిమాను మార్చి 28న రిలీజ్ చేయాలని.. పవన్ సినిమా వచ్చేట్లుంటే వేచి చూసి డేట్ మార్చుకోవచ్చని భావిస్తుననారేమో. ఏ విషయం తేలే వరకు ఆ డేట్‌కే కట్టుబడి ఉంటే.. ఇంకెవరూ పోటీలోకి రారని అనుకుంటున్నారేమో.
This post was last modified on February 7, 2025 8:07 am
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా,…
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు నుంచి ఇటీవల రిలీజ్ చేసిన…
మూడేళ్లు వెనక్కి వెళ్తే.. తమిళ సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో మొదలైన ఓ సినిమాకు ముందు ఓకే చెప్పి, తర్వాత…
రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ…
కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల రాజకీయాలు వద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రెండురాష్ట్రాలకూ నీటి సమస్యలు ఉన్నాయని..…