ఈ మధ్య కాలంలో అజిత్ లాంటి స్టార్ ఉన్న పెద్ద సినిమా బజ్ లేకుండా విడుదలయ్యిందంటే అది పట్టుదల మాత్రమే. తమిళంలో విడాముయార్చిగా రిలీజై ఓపెనింగ్స్ తెచ్చుకుంది కానీ సామాన్య ప్రేక్షకుల్లో అంచనాలు రేపడంలో ఒరిజినల్ వెర్షన్ సైతం తడబడిన మాట వాస్తవం.
ఎలాంటి ప్రమోషన్లు చేయలేదు. హీరో ఎప్పటిలాగే ఒక్క ప్రెస్ మీట్ కు రాలేదు. దర్శకుడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ సంబంధం లేని ఇతర విషయాలు హైలైట్ అయ్యాయి. ఇక అర్జున్, త్రిష, రెజీనా ఎక్కువ కనిపిస్తే ఒట్టు. ఇక అనిరుధ్ రవిచందర్ సంగతి సరేసరి. ఒక మొక్కుబడి ట్వీట్ పెట్టి చేతులు దులుపుకున్నాడు.
అందరూ ఇంత నిర్లిప్తంగా ఉండటానికి బహుశా ముందే ఫలితం ఊహించడం వల్ల కావొచ్చనేది సులభంగా అర్థమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ పట్టుదల నిర్మాణం విషయంలో చాలా ఒడిదుడుకులు చూసింది. ఎన్నో వాయిదాలు పడ్డాయి. రీమేక్ కేసుల తలనెప్పులు వచ్చాయి.
పొంగల్ రిలీజ్ మిస్ చేసుకోవడం చాలా నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఫిబ్రవరి లాంటి డ్రై సీజన్ భారీ వసూళ్లు తేవడం అనుమానంగా ఉన్నా అజిత్ ఇమేజ్ ని నమ్ముకుని దింపేశారు. తీరా చూస్తే నెగటివ్ రివ్యూలు, ఆడియన్స్ అసంతృప్తి కళ్ళముందు కనిపిస్తోంది. దర్శకుడు మాగిజ్ తిరుమేని టేకింగ్ పట్ల సర్వత్రా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
విపరీతమైన నెమ్మదితనంతో కథనం నడిపించిన విధానం కనీసం ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. టెక్నికల్ గా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నప్పటికీ ఆద్యంతం ఎంగేజింగ్ గా నడవడంలో పట్టుదల ఫెయిలయ్యింది. ఎంటర్ టైన్మెంట్, ఎలివేషన్, ఎమోషన్, అనిరుధ్ మ్యూజిక్ ఇలా ఏదీ బాలన్స్ కాక రెంటికి చెడ్డ రేవడిలా మారింది.
అజిత్ తో పాటు క్యాస్టింగ్ అంతా తమ పరిధుల మేరకు బాగానే నటించినా క్యారెక్టర్లలో బలం లేకపోవడంతో వాళ్ళూ నీరసంగా మారిపోయారు. ఇదంతా ముందే ఊహించి మేకర్స్ పట్టు వదిలేశారని తల ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఇక వాళ్ళ ఆశలన్నీ ఏప్రిల్ 10 రాబోయే గుడ్ బ్యాడ్ ఆగ్లీ మీదే.
This post was last modified on February 7, 2025 7:23 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…