ఈ రోజు ఉదయం నుంచి ట్విట్టర్లో దేశవ్యాప్తంగా #baahubali2 పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇప్పుడేమీ బాహుబలి-2కు వార్షికోత్సవం జరగట్లేదు. ఆ సినిమాకు సంబంధించి ఇంకే రకమైన అకేషన్ కూడా లేదు. అయినా సరే.. ఇప్పుడెందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోందని ఆశ్చర్యం కలగక మానదు. కానీ విషయం ఏంటంటే.. ‘బాహుబలి-2’ రీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కానీ అది మన దేశంలో కాదు. అమెరికాలో. అక్కడ పెద్ద స్థాయిలోనే ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.
యుఎస్‌లోని 16 నగరాల్లో వారం పాటు ‘బాహుబలి-2’ను ప్రదర్శించబోతున్నారు. ఇందుక్కారణం ఈ వారంలో ప్రభాస్ పుట్టిన రోజు రాబోతుండటం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారం పాటు యుఎస్‌లో ‘బాహుబలి-2’ను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అసలే రీ రిలీజ్ కాన్సెప్టే లేని ఈ రోజుల్లో ఇలా ఒక భారతీయ హీరో పుట్టిన రోజును పురస్కరించుకుని యుఎస్‌లో ఈ స్థాయిలో ఒక సినిమా మళ్లీ ప్రదర్శితం కావడం విశేషమే. దీన్ని బట్టే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక యుఎస్‌లో నాన్-ఇండియన్స్‌కు సైతం ‘బాహుబలి’ ప్రకంపనల గురించి బాగానే తెలుసు. అక్కడ ఏకంగా 20 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిందా చిత్రం.
భారతీయ కరెన్సీలో రూ.130 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఆ చిత్రానికి అక్కడ. ‘బాహుబలి: ది బిగింగ్’ సైతం 7-8 మిలియన్ డాలర్ల మధ్య వసూళ్లు రాబట్టింది. ‘బాహుబలి-2’ విడుదలైనపుడు హాలీవుడ్ పెద్ద సినిమాలకు దీటుగా బాక్సాఫీస్ చార్టుట్లో అగ్ర భాగాన నిలిచిందీ చిత్రం. ఇప్పుడు కరోనా వల్ల యుఎస్‌లో సైతం హాలీవుడ్ సినిమాల సందడి పెద్దగా లేదు. ఇలాంటి సమయంలో విడుదలవుతున్న ‘బాహుబలి-2’ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 4:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…