బిగ్ బాస్ నాలుగో సీజన్ కొంచెం నాటకీయంగానే సాగుతోంది. గత వారం కమెడియన్ కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక దృశ్యం చూసిన బిగ్ బాస్ వీక్షకులకు మండిపోయింది. ఆ దృశ్యం తర్వాత ఓ కంటెస్టెంట్ ప్రేక్షకుల టార్గెట్‌గా మారిపోయాడు. అతనే.. అఖిల్. హౌస్‌లో బాగా యాటిట్యూడ్ ఉన్న వ్యక్తుల్లో ఒకడిగా అఖిల్‌కు పేరుంది. అతను ఇప్పటికే కొన్ని వివాదాల్లో భాగం అయ్యాడు. ముఖ్యంగా మోనాల్ కోసం అతను అభిజిత్‌తో బాగా గొడవ పడ్డాడు. దీనికి సంబంధించి కొన్ని ప్రోమోలు కూడా సంచలనం రేపాయి.
అఖిల్ చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పెట్టేసుకుంటున్నాడని.. బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడని కంప్లైంట్లు చాలానే ఉన్నాయి. ఐతే ఇంతకుమందు ఎలిమినేషన్ జాబితాలోకి వచ్చినప్పటికీ.. వేరే కంటెస్టెంట్ల మీద ఎక్కువ వ్యతిరేకత ఉండటం వల్లో, అతడికీ కొంత మేర ఫాలోవర్లు ఉండటం వల్లో ఏమో బతికిపోయాడు.
కానీ తాజా పరిణామాల నేపథ్యంలో అఖిల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి సమయం దగ్గర పడ్డట్లే అంటున్నారు బిగ్ బాస్ వీక్షకులు. కుమార్ సాయి ఎలిమినేట్ అయిన సందర్భంగా హౌస్‌లో ఒక్కొక్కరి గురించి విశ్లేషించే ప్రయత్నం చేశాడు. ఐతే అఖిల్ దగ్గరికి వచ్చినపుడు అతడి గురించి మాట్లాడుతూ.. టాస్కుల్లో అతను ఫుల్ ఎనర్జీ వాడే ప్రయత్నం చేస్తున్నాడని, బాగా కష్టపడుతున్నాడని.. కానీ ఫెయిలవుతున్నాడని.. అలాగే ప్రయత్నించాలని అన్నాడు కుమార్ సాయి. అతడి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు. కానీ అఖిల్ దానికి చాలా సెటైరిగ్గా స్పందించాడు. ‘‘నువ్వు టాస్కుల్లో గెలిచినా కూడా బయటికి వెళ్లిపోయావు బ్రో’’ అంటూ పంచ్ వేశాడు. ఆ మాట అన్నపుడు అతడి హావభావాలు చూస్తే ఎంత యాటిట్యూడ్ ఉన్నోడన్నది అర్థమవుతుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాడు బాధతో ఉంటాడని, అతను ఒక సలహా ఇవ్వబోతే దానికి ఇలా కౌంటర్ వేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎలిమినేషన్లోకి వస్తే అఖిల్‌ను టార్గెట్ చేయాల్సిందే అని బిగ్ బాస్ వీక్షకులు గట్టిగా అనుకున్నట్లే ఉంది వారి వ్యాఖ్యలు చూస్తే. మరి చూడాలని ఏమవుతుందో?
This post was last modified on October 20, 2020 4:26 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…