ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్ నాని ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ కు రెడీ అవుతున్నాడు. అనిరుధ్ రవిచందర్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రకటించాక ఇప్పటికే పీక్స్ లో ఉన్న అంచనాలు మరింత ఎగబాకాయి.
నిర్మాతగానూ నాని డబుల్ ప్రమోషన్ అందుకోబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా తన సమర్పణలో శ్రీకాంత్ ఓదెలకు దగ్గరుండి ప్రాజెక్టు చేయించాడు. ఇక నాని హీరో నెక్స్ట్ ఎవరితో చేతులు కలపబోతున్నాడనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వాటిలో వినిపిస్తున్నపేరు కోలీవుడ్ ఫేమ్ సిబి చక్రవర్తి.
నిజానికీ కలయిక ఏడాదిన్నర క్రితమే నాంది వేసుకుంది. శివ కార్తికేయన్ డాన్ చూసి ఇంప్రెస్ అయిన నాని అతనితో సినిమా చేయాలని ఆసక్తి చూపించాడు. తొలుత చెప్పిన లైన్ నచ్చడంతో హైదరాబాద్ లోనే ఆఫీస్ తీసి పనులు ప్రారంభించారు. కొంత కాలం అయ్యాక ఫైనల్ వర్షన్ అంత సంతృప్తికరంగా రాకపోవడంతో తాత్కాలికంగా పెండింగ్ పెట్టేశారు.
ఈలోగా శిబి చక్రవర్తి మళ్ళీ శివ కార్తికేయన్ తోనే రెండో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు. కానీ అతను అమరన్, పరాశక్తి, మురగదాస్ సినిమాలతో బిజీగా ఉండటంతో అది కూడా వాయిదా పడింది. తాజాగా ట్విస్టు ఏంటంటే నానిని సిబి మరోసారి కలిసి ఒప్పించాడట.
అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కానీ అంతర్గతంగా అంగీకారం వచ్చిందని ఫిలిం నగర్ టాక్. డాన్ లో కామెడీ, ఎమోషన్స్ ని చక్కగా బాలన్స్ చేసి సూపర్ హిట్ అందుకున్న సిబి చక్రవర్తికి నాని లాంటి టైమింగ్ ఉన్న హీరోలు దొరికితే పండగే. అందుకే పట్టు వదలకుండా ట్రై చేసి ఆఖరికి సక్సెస్ అయ్యాడని సమాచారం.
అయితే అధికారికంగా ప్రకటన వచ్చేదాకా నిర్ధారణగా చెప్పలేం. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న నాని ఈసారి హిట్ 3, ది ప్యారడైజ్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇన్ సైడ్ టాక్స్ నిజమయ్యేలానే వినిపిస్తున్నాయి.
This post was last modified on February 5, 2025 3:09 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…