వరదలతో అల్లాడిపోతోంది హైదరాబాద్. నగరంలో కనీ వినీ ఎరుగని వరుణుడి బీభత్సానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. వేల కోట్లల్లో ఆస్తులు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. బాగా బతికిన వాళ్లు కూడా ఇప్పుడు తిండీ నీళ్లు దొరక్క అల్లాడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నం చేస్తోంది. సాయం కోసం కేంద్రాన్ని అర్థిస్తే ఎలాంటి స్పందన కనిపించడం లేదు.
ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఏపీ సర్కారు ముందుకొచ్చింది. సాయాన్ని ప్రతిపాదించింది. తమిళనాడు ప్రభుత్వం సైతం తెలంగాణ సర్కారుకు తన వంతుగా సాయం అందించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి తోడ్పాటు అందించేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి తొలి అడుగు వేశాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున.
వరద సాయం కింద అత్యవసరంగా రూ.550 కోట్లను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన నాగ్.. తన వంతుగా వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు నాగ్. ఇంతకుముందు మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ రూ.1.5 కోట్ల రూపాయల విరాళాన్ని వరద సాయంగా ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. కానీ అది ఫేక్ న్యూస్ అని తేలింది.
ఐతే ఇప్పుడు నాగ్ స్వయంగా ఈ విరాళం గురించి ప్రకటన చేశాడు. అక్కినేని హీరో సాయం ప్రకటించిన కొన్ని నిమిషాలకే ఆయన్ని బాబాయిగా పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం విశేషం. హైదరాబాద్ వరదల గురించి ఆవేదన వ్యక్తం చేసిన తారక్.. తన వంతుగా సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. మరోవైపు విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు.. త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ తలో రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సాయానికి ముందుకొచ్చారు. వాళ్లిద్దరూ తలో కోటి చొప్పున విరాళం ప్రకటించడం విశేషం. ఇక సినీ పరిశ్రమ నుంచి మరింత మంది సాయానికి ముందుకు రావడం ఖాయం.
This post was last modified on October 20, 2020 4:59 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…