Movie News

జూనియర్ అభిమానులు ఎందుకు ఫీలయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని సుదీర్ఘమైన సందేశం విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. మీ భద్రత, ప్రాణాల కంటే తనకు ఇంకేదీ ముఖ్యం కాదని తారక్ అందులో ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎవరికీ ప్రమాదం జరగకూడదన్న ఆలోచనను బయట పెట్టింది.

నిజానికి అభిమానులు అంతగా ఫీలయ్యి సోషల్ మీడియాలో తమ హీరోని కలుసుకునేందుకు డిమాండ్ చేయడం వెనుక కారణాలు ఉన్నాయి. దేవర విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం వాటిలో ప్రధానమైంది.

తిరిగి మళ్ళీ నిర్వహిస్తారనుకుంటే జరగలేదు. పోనీ దేవర అంత పెద్ద బ్లాక్ బస్టరయ్యాక సక్సెస్ మీట్ అయినా ఫ్యాన్స్ తో కలిపి చేస్తారనుకుంటే అక్కడా నిరాశే ఎదురయ్యింది. నిర్మాత నాగవంశీ దుబాయ్ తీసుకెళ్లి డిస్ట్రిబ్యూటర్లకు పార్టీ ఇచ్చారు కానీ ఇక్కడ నో సెలబ్రేషన్.

నోవాటెల్ లో రద్దీని తట్టుకోలేక క్యాన్సిల్ చేయడం వరకు ఓకే కానీ తర్వాత ఏపీలో అయినా చేసి ఉంటే బాగుండేదని అభిమానులు డిమాండ్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. కనీసం ఫోటో సెషన్ కూడా లేవు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ అయిపోయింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొందరు ఫ్యాన్స్ ఎలాగైనా తారక్ ను కలుసుకోవాలని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం మరో ప్రహసనంగా మారింది. దీని వల్ల వాళ్ళ ఆరోగ్యాలు రిస్క్ లో పడతాయని గుర్తించిన జూనియర్ అలా చేస్తేనే తనను కలుసుకోవచ్చనే అభిప్రాయాన్ని తప్పని చెప్పే ఉద్దేశం కూడా ప్రెస్ నోట్ లో ఉంది.

ఈ ఏడాది ఎలాగూ వార్ 2 రిలీజ్ ఉంది. దానికి ఏపీ తెలంగాణలో ఈవెంట్లు ఉంటాయి. ప్రశాంత్ నీల్ సినిమా కూడా 2026 సంక్రాంతికే అనుకుంటున్నారు. అంటే తక్కువ గ్యాప్ లో జూనియర్ ఎన్టీఆర్ ని పబ్లిక్ ప్లాట్ ఫార్మ్స్ మీద చూడొచ్చు. కాకపోతే అభిమానులు కాస్తంత సహనంగా ఉండటం అవసరం.

This post was last modified on February 4, 2025 10:06 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jr NTR

Recent Posts

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

5 minutes ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

24 minutes ago

జ‌గ‌న్‌ను మ‌రోసారి ఏకేసిన‌ ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్.. లండ‌న్ నుంచి ఇలా వ‌చ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు,…

1 hour ago

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…

2 hours ago

బాప‌ట్ల త‌మ్ముళ్ల మ‌ధ్య ‘ఎన్టీఆర్’ వివాదం

కూట‌మి ప్ర‌భుత్వంలో క‌లిసి మెలిసి ఉండాల‌ని.. నాయ‌కులు ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే…

2 hours ago

ఫిబ్ర‌వ‌రి 4.. నాకు స్పెష‌ల్ డే: రేవంత్‌రెడ్డి

"ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్ర‌త్య‌కంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…

3 hours ago