పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ దాకా అందరి సరసన ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యింది. దశాబ్దంన్నరకు పైగానే టాప్ హీరోయిన్ గా వెలిగింది.
తర్వాత సహజంగానే అవకాశాలు తగ్గడం, కొత్త జనరేషన్ దూసుకురావడంతో క్రమంగా ఫ్యామిలీ లైఫ్ కి షిఫ్ట్ అయిపోయింది. భర్త, బిడ్డ అంటూ కుటుంబం మొదలైనా సినిమాలు ఆపలేదు. సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఆర్ఆర్ఆర్, కబ్జా, దృశ్యం 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
ఇది కాదు అసలు విశేషం. ఇంకా తన మీద ఐటెం సాంగులు తీసే దర్శకులు ఉండటం. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న మెట్రోలో శ్రియ మీద ఒక ప్రత్యేక గీతం చిత్రీకరించారట. మెయిన్ లీడ్ పూజా హెగ్డే పాత్ర మరీ హోమ్లీగా ఉండటంతో గ్లామర్ టచ్ కోసం శ్రియని తీసుకొచ్చినట్టు సమాచారం.
జైలర్ లో తమన్నా లాగా కొన్ని సీన్లు కూడా ఉంటాయని చెన్నై టాక్. ఇంత లేట్ ఏజ్ లోనూ శ్రియకు ఆఫర్లు రావడం విశేషమే. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన మాసీ సాంగ్ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. సూర్య, శ్రియ జోడీ గతంలో ఏ సినిమాలోనూ జంటగా నటించకపోవడం ట్విస్టు.
రెట్రో మీద మాములు అంచనాలు లేవు. కంగువ ఎంత డిజాస్టర్ అయినా దాని గాయాన్ని రెట్రో పూర్తిగా మాన్పుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. మే 1 విడుదలని అధికారికంగా కొద్దిరోజుల ముందే ప్రకటించారు. తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ కాబోతోంది. గ్యాంగ్ స్టర్ గా సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.
ఇక కార్తీక్ సుబ్బరాజ్ విషయానికి వస్తే జిగర్ తండా డబుల్ ఎక్స్ తమిళంలో పెద్ద హిట్ అయినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లో డిజాస్టర్ అయ్యింది. అందుకే రెట్రోతో ప్రూవ్ చేసుకోవడం తనకూ చాలా కీలకం. సూర్య ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా రెట్రో హక్కులకు మంచి డిమాండ్ అయితే ఉంది.
This post was last modified on February 4, 2025 6:16 pm
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తప్పించి… ఆ పార్టీ…
వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఎన్నికలు పూర్తయి ఏడాది అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. నోరు…
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…