తెలుగులో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘మనసంతా నువ్వే’ ఒకటి. అప్పటి యువతకు ఇది ఒక మధుర జ్ఞాపకం. ఆ సినిమాను ఇప్పుడు తలుచుకున్నా వాళ్లందరికీ మనసు పులకరిస్తుంది. ఈ చిత్రంతో ఉదయ్ కిరణ్ స్టార్ అయిపోయాడు. యువ ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి ఘనంగా అరంగేట్రం చేశాడు. నిర్మాత ఎం.ఎస్.రాజుకు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. ‘మనసంతా నువ్వే’ విడుదలై 19 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా మొదలవడానికి ముందు జరిగిన కథను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
90ల్లో శత్రువు, దేవి లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన ఎం.ఎస్.రాజు.. భారీ బడ్జెట్లో చేసిన సాహసోపేత సినిమా ‘దేవి పుత్రుడు’ 2001 సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ అయింది. ఆ సినిమా మీద పెట్టిన రూ.14 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. అప్పటిదాకా సినీ పరిశ్రమలో రాజు సాధించిందంతా ఈ సినిమాతో కొట్టుకుపోయింది. దీని దెబ్బకు కుంగిపోయిన రాజు.. అంత సులువుగా కోలుకోలేకపోయారు. తర్వాత ఏదైనా అద్భుతం చేయాలని ఆరాటపడ్డారు. అప్పుడే ఓ చిన్న సినిమాతో పుంజుకోవాలనుకున్నారు. అలాంటి సమయంలో రాజు ఒక పాత కాలం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా చూశారు. అందులో హీరో హీరోయిన్లు ఒకరినొకరు కలుసుకోవడానికి ఎంతో తపన పడతారు. అది చూడగానే ఈ ఐడియాతో సినిమా తీయాలనిపించింది రాజుకు.
వెంటనే పరుచూరి సోదరులకు, కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డికి ఆ ఐడియా చెబితే బాగా నచ్చేసింది. అప్పటిదాకా తన బేనర్లో అన్ని సినిమాలూ డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణనే ఈ సినిమాకూ పెట్టుకుందామనుకుంటే ఆయనకు ఖాళీ లేదు. తర్వాత గోపాల్ రెడ్డి సూచన మేరకు వి.ఎన్.ఆదిత్యను దర్శకుడిగా తీసుకున్నారు రాజు. దర్శకుడు తేజకు ఫోన్ చేస్తే హీరోగా ఉదయ్ కిరణ్‌ను సజెస్ట్ చేశాడు. సంగీత దర్శకుడిగా తన ‘దేవి’ సినిమాకు పని చేసిన దేవిశ్రీ ప్రసాద్‌నే తీసుకుందామనుకుంటే కుదరక ఆర్పీ పట్నాయక్‌కు ఎంచుకున్నారు రాజు. ఒక్క రోజులోనే ట్యూన్లనే ఓకే అయిపోయాయి.
మే 1న రాజుకు ‘మనసంతా నువ్వే’కు సంబంధించి ఐడియా రాగా.. 10న సినిమాకు పూజ జరిగింది. జూన్ 1న షూటింగ్ మొదలుపెట్టాలి. అరకుకు వెళ్లి అక్కడ స్టోరీ సిట్టింగ్స్ వేయగా.. 20 రోజుల్లో స్క్రిప్టు రెడీ అయిపోయింది. జూన్ 1న షూటింగ్ మొదలైంది. నాలుగు నెలల్లో సినిమా అయిపోయింది. ఎన్నో బిజినెస్ ఆఫర్లు వచ్చినా.. రాజు సొంతంగా రిలీజ్ చేశారు. అక్టోబరు 19న విడుదలైన ‘మనసంతా నువ్వే’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రూ.1.3 కోట్లతో తీసిన సినిమా అప్పట్లోనే రూ.16 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ దెబ్బతో రాజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయాయి.
This post was last modified on October 20, 2020 11:49 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…