విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకుంది కానీ విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి. బూతులు ఎక్కువయ్యాయని, వెంకీ లాంటి ఫ్యామిలీ హీరో నుంచి ఇలాంటివి ఆశించలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి.
తొలుత ఇవి మాములేనని భావించినా తర్వాత వాటిలో సీరియస్ నెస్ గుర్తించిన వెంకటేష్ రెండో సీజన్ లో డోస్ తగ్గించేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడం ఇటీవలి ప్రెస్ మీట్ లో చూశాం. ఈ నేపథ్యంలో రానా నాయుడు 2 రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది. తాజాగా టీజర్ వచ్చింది.
పైన భలే టైమింగ్ అని చెప్పడంలో లాజిక్ ఉంది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాంతో రీజనల్ ఫిలింస్ లో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ చాలా ఏళ్ళ తర్వాత ఇంత గొప్ప విజయం సాధించారు. థియేటర్లకు రావడం మానేసిన ఎందరో ప్రేక్షకులు కేవలం టాక్ విని బయటికి కదిలారు.
ఎంతగా అంటే మూడు వారాలు దాటకుండానే మూడు వందల కోట్ల వసూళ్లు దాటించేంత. సో కొన్ని సంవత్సరాలుగా రేసులో వెనుకబడినట్టు అనిపించిన వెంకీ ఒక్కసారిగా చిరంజీవి రికార్డులనే సవాల్ చేసేలా పరుగులు పెడుతున్నాడు. తండేల్ వచ్చేదాకా వెంకీ మామ దూకుడు ఆగేలా కనిపించడం లేదు.
ఇదంతా రానా నాయుడు 2కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ కనిపించబోయే ఫ్రెష్ రిలీజ్ ఇదే కాబట్టి సహజంగానే అధిక శాతం ఆడియన్స్ చూసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఎలాగూ డబుల్ మీనింగులు తగ్గించామని హామీ ఇచ్చారు కనక వ్యూయర్ షిప్ మతిపోయేలా వచ్చినా ఆశ్చర్యం లేదు.
కాకపోతే టాక్, రివ్యూలు కీలక పాత్ర పోషించనున్నాయి. వెంకీ సైతం దగ్గరుండి టీమ్ కు పలు సూచనలు చేసే అవకాశాలు లేకపోలేదు. రానా సీక్వెల్ లోనూ కొనసాగుతూ ఉండగా అర్జున్ రామ్ పాల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తోడయ్యింది. స్ట్రీమింగ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. వేసవిలో రావొచ్చు.
This post was last modified on February 3, 2025 10:39 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…