తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. ఒకే వారంలో ఒక సినిమాని కిందికి చూసి మరొక సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి చరిత్ర సృష్టించారని చెప్పడం కొందరు మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది.
గేమ్ ఛేంజర్ గురించి కావాలనే ప్రస్తావించారని వాళ్ళ అభిప్రాయం. అక్కడ పేర్లు ప్రస్తావించకపోయినా అరవింద్ స్పష్టంగా చెప్పిన దాన్ని బట్టి ఒక ఫ్లాప్ ఒక బ్లాక్ బస్టర్ ఏవో అందరికీ తెలిసిన విషయాలే. సరే ఆయన ఉద్దేశంలో అర్థం ఉందా అపార్థముందా అనేది కొంత విశ్లేషించుకుంటే అర్థమవుతుంది.
నిజానికి అరవింద్ చెప్పాలనుకున్నది ఒకదానితో మరొకటి సంబంధం లేని రెండు వ్యతిరేక ఫలితాలను దిల్ రాజు చూశారని. వాటితో పాటు ఇన్కమ్ టాక్స్ దాడులను ఆహ్వానించారని. అంతే తప్ప గేమ్ ఛేంజర్ పోయింది కాబట్టి నాకేదో ఆనందంగా ఉందని కాదు. ఆ మాటకొస్తే మేనల్లుడు రామ్ చరణ్ కు ఇలా జరగాలని ఆయనైనా ఎందుకు కోరుకుంటారనేది బన్నీ ఫ్యాన్స్ లాజిక్.
అన్ స్టాపబుల్ షోలో ఔటింగ్ కు మెగా బ్రదర్స్ లో ఎవరితో వెళ్తావంటే చరణ్ చెప్పిన సమాధానం అరవింద్ మావయ్య. అంటే ఎంత ఘాడమైన బంధం లేనిదే అలా అనడు కదా. ఇవన్నీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలు.
ఇదేదో అరవింద్ గారిని సమర్ధించడం కాదు. ఆ మాటకొస్తే గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్లు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఎన్నో చూశారు. ఇప్పుడేదో కొత్తగా జరిగింది కాదు. యధాలాపంగా అన్నదానికి విపరీత అర్థాలు తీస్తే ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు కానీ మొత్తానికి ఈ పరిణామం తండేల్ మీద ప్రభావం చూపించకోపోతే చాలు.
దర్శకుడు చందూ మొండేటి కన్నా కంటెంట్ మీద బలమైన నమ్మకం చూపిస్తోంది అరవిందే. అందుకే రిలీజ్ డేట్ గురించి తొందపడకుండా సంక్రాంతి మిస్ అయినా సోలో తేదీ వచ్చేలా ఫిబ్రవరి 7 ఎంచుకున్నారు. మంచి ఓపెనింగ్స్ కి తేవడంలో ఈ నిర్ణయం చాలా దోహదం చేయనుంది.
This post was last modified on February 3, 2025 11:44 am
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…