పెద్ద బేనర్లు కేవలం భారీ సినిమాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ చిన్న ప్రాజెక్టులను టేకప్ చేస్తుండటం గమనించవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థలుగా ఉన్న శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, యువి క్రియేుషన్స్, మైత్రీ మూవీ మేకర్స్.. ఇవన్నీ కూడా చిన్న సినిమాలను టేకప్ చేస్తున్నవే. ఈ కోవలోకి శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర కూడా చేరింది.
సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ ఛత్రపతి, అత్తారింటికి దారేది లాంటి భారీ చిత్రాలను నిర్మించింది. ఈ మధ్య కొంచెం రేంజ్ తగ్గించుకుని తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, సోలో బ్రతుకే సో బెటర్ లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వచ్చింది. ఇప్పుడా సంస్థ ప్రయోగాత్మకంగా ఒక చిన్న సినిమాను లైన్లో పెట్టింది. ఆ సినిమా పేరు.. నిన్నిలా నిన్నిలా.
ఆసక్తికర కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘నిన్నిలా నిన్నిలా’. ఈ చిత్రంతో తమిళ కథానాయకుడు అశోక్ సెల్వన్ తెలుగులోకి అడుగు పెడుతున్నాడు. డబ్బింగ్ మూవీ భద్రమ్, పిజ్జా-2లతో తెలుగు ప్రేక్షకులకు ఓ మోస్తరుగా పరిచయం ఉన్నాడు అశోక్. ఈ మధ్యే అతను తమిళంలో ‘ఓ మై కడవులే’తో భారీ విజయాన్నందుకున్నాడు. ‘నిన్నిలా నిన్నిలా’లో అతడి సరసన సీనియర్ హీరోయిన్ నిత్యా మీనన్‌తో పాటు తెలుగమ్మాయి రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
కిచెన్‌లోని ప్లేట్లలో లీడ్ యాక్టర్ల తలలు కనిపిస్తున్నాయి. అలాగే రకరకాల ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. చూస్తుంటే ఇది ఫుడ్, కిచెన్ చుట్టూ తిరిగే సినిమానేమో అనిపిస్తోంది. ‘కుకింగ్ సూన్’ అంటూ పోస్టర్ మీద వేశారు కూడా. అని శశి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దివాకర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
This post was last modified on October 20, 2020 8:29 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…