దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసుకుని త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. చాలా వయొలెంట్ కంటెంట్ తో ఇది రూపొందబోతోందని ఇన్ సైడ్ న్యూస్.
అనౌన్స్ మెంట్ టీజర్ తోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారడం ఖాయమని ప్రీ లుక్ చూసిన వాళ్ళు చెబుతున్న మాట. క్యాస్టింగ్ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ ది ప్యారడైజ్ కు అనిరుధ్ రవిచందర్ ను సంగీత దర్శకుడిగా లాక్ చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు అసలు విషయం చూద్దాం.
ఈ ప్రాజెక్టు చర్చల దశలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందనే దాని మీద తర్జనభర్జనలు జరిగాయి. ముందు దేవిశ్రీ ప్రసాద్ పేరు పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత ఒక దశలో కీరవాణిని కూడా అనుకున్నారు. కానీ నాని మాత్రం ఇంత టెర్రిఫిక్ కంటెంట్ ని అనిరుధ్ అయితేనే న్యాయం చేస్తాడని ఎలాగైనా అతన్ని ఒప్పించే బాధ్యతను తనతో పాటు శ్రీకాంత్ ఓదెలకు పంచేశాడు.
కానీ అనిరుధ్ అడగ్గానే ఒప్పుకోలేదు. ఎందుకంటే తమిళం పక్కనపెడితే తెలుగులో తనకు మేజిక్, విజయ్ దేవరకొండ 12 పనులు పెండింగ్ ఉన్నాయి. రెండింటి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కావడం వల్ల మేనేజ్ అవుతోంది.
ఇంకోవైపు బాలకృష్ణ – గోపిచంద్ మలినేని సినిమా కోసం మైత్రి వాళ్ళు అనిరుధ్ ని దాదాపు ఖాయం చేసుకున్నట్టే. ఇంత ఒత్తిడిలో ది ప్యారడైజ్ కు న్యాయం చేయలేనేమోనని భావించి నో చెబుతూ వచ్చాడట. కానీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకుందామని నాని కన్విన్స్ చేయడం వల్లే ఫైనల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చారని తెలిసింది.
సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ది ప్యారడైజ్ తర్వాత శ్రీకాంత్ ఓదెల నాని సమర్పణలోనే చిరంజీవితో ఒక భారీ చిత్రం చేయబోతున్నాడు. దీనికి కూడా అనిరుధ్ సంగీతం ఇవ్వొచ్చనేది చెన్నై టాక్. చూడాలి ఏమవుతుందో.
This post was last modified on February 2, 2025 6:41 pm
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…
వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార…