సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్ కాదని స్వయంగా ఆమిరే ఇటీవల ఓ సందర్భంలో స్పష్టం చేశాడు. తన వైవాహిక బంధాలు నిలబడకపోవడానికి కారణం తనే అని అను చెప్పడం విశేషం. ఆమిర్‌కు ఒకటికి రెండుసార్లు వివాహం జరిగింది. కానీ రెండుసార్లూ ఆ బంధాలు నిలబడలేదు.
మొదటగా ఆమిర్ యుక్త వయసులో ఉండగా ప్రేమించి పెళ్లి చేసుకున్న రీనా దత్తాతో 16 ఏళ్లు కలిసి ఉన్నాడు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. 1986లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2002లో విడిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల కోసం తనతో కలిసి పని చేసిన కిరణ్ రావును 2005లో పెళ్లాడాడు ఆమిర్. వీరికీ సంతానం కలిగింది. ఈ జంటను చూస్తే వేవ్ లెంగ్త్ బాగా కలిసేలా కనిపించారు. ఈ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అనుకుంటే.. 2021లో విడాకులు తీసుకుని షాకిచ్చారు.
ప్రస్తుతం ఆమిర్ వయసు 59 ఏళ్లకు చేరుకోవడంతో ఇక ఆమిర్ ఒంటరిగానే ఉండిపోతాడని అనుకున్నారంతా. కానీ ఈ లెజెండరీ నటుడు త్వరలోనే మళ్లీ పెళ్లికొడుకు కాబోతున్నాడంటూ బాలీవుడ్ వార్తలు మొదలయ్యాయి. అతను కొంత కాలంగా బెంగళూరుకు చెందిన ఒక మహిళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడట. ఆమె గురించి వివరాలేవీ బయటికి రావట్లేదు. తనకు సినీ రంగంతో సంబంధం లేదని అంటున్నారు.
ఆమిర్ కొంత కాలంగా ఆమెను తరచూ కలుస్తున్నాడని.. ఇటీవలే కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని.. త్వరలోనే తమ బంధం గురించి అధికారికంగా ప్రకటించబోతున్నాడని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని నెలల్లో వీరి పెళ్లి కూడా ఉంటుందని అంటున్నారు. 60వ పడికి చేరువ అవుతున్న ఆమిర్.. మూడో వైవాహిక బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఆమిర్ కాబోయే భార్య ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on February 1, 2025 6:58 pm
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…
వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి…
పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో వేతన జీవులు ఆశించిన దానికంటే ఎక్కువగానే మేలు జరిగిందని…