వచ్చే వారం ఫిబ్రవరి 7 విడుదల కాబోతున్న తండేల్ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. నాగచైతన్య కెరీర్ లో మొదటి ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ కావడం, ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఇలా అన్ని శుభ శకునాలే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మంచి మ్యూజిక్ ఇవ్వడం తండేల్ కి చాలా ప్లస్ కానుంది. పుష్ప 2 ది రూల్ తర్వాత మరో బెస్ట్ ఆల్బమ్ ఇస్తున్నాడన్న భరోసా అయితే దొరికింది. దీని వెనుక ఇంటరెస్టింగ్ కథుంది. అదేంటో చూద్దాం.
షూటింగ్ కు ముందు తండేల్ సంగీత దర్శకుడిగా ఎవరిని పెట్టుకోవాలనే మీమాంస నిర్మాత అల్లు అరవింద్ కు మొదలయ్యింది. ముందు దేవిశ్రీ ప్రసాద్ నే అనుకున్నారు కానీ పుష్ప 2తో తన కమిట్ మెంట్ దృష్ట్యా మొత్తం వాళ్లే పిండేసుకుంటారు కాబట్టి తమకు అంత టైం ఇవ్వకపోవచ్చనే అనుమానంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారు.
ఓసారి ఇంట్లో అల్లు అరవింద్ ఇదే విషయాన్ని బన్నీ దగ్గర ప్రస్తావించారు. నిన్ను, సుకుమార్ ని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అన్నారు. దీనికి బదులుగా అల్లు అర్జున్ ప్రేమకథకు డిఎస్పి కాకుండా ఇంకెవరినో ఆలోచించడం ఏమిటని చెప్పి లాక్ చేయించాడు.
అలా అరవింద్ అనుమాన పడిన దేవి ప్రవేశం బన్నీ బంధంతో బలపడిందన్న మాట. ఇప్పుడదే సినిమా మీద అంచనాలు పెంచడంలో దోహదం చేసింది. జాతర పాట, బుజ్జి తల్లి, హైలెస్సో ఒకటికి మించి మరొకటి హిట్టయిపోయాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోందో చూడాలి.
కొత్త సంవత్సరంలో జనవరి బోణీని సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ విజయవంతంగా పూర్తి చేశాక ఇప్పుడు అందరి దృష్టి తండేల్ మీద ఉంది. తొంభై కోట్ల దాకా బడ్జెట్ పెట్టారని టాక్ ఉంది కానీ విజువల్స్ చూస్తే నిజమే అనిపిస్తోంది. ముందు రోజు ప్రీమియర్లు వేయడం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు.
This post was last modified on February 1, 2025 5:32 pm
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి…
పన్నెండు సంవత్సరాల తర్వాత విడుదలైనా తమిళంలో ఊహించని వసూళ్లతో అరవై కోట్లకు పైగా తెచ్చిన మదగజరాజ పద్దెనిమిది రోజుల తర్వాత…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో వేతన జీవులు ఆశించిన దానికంటే ఎక్కువగానే మేలు జరిగిందని…
రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదన్న విషయం స్పష్టమైంది. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర…