ఓటీటీ సినిమాలంటే భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మధ్య. వరుసగా వివిధ భాషల్లో రిలీజైన ఓటీటీ సినిమాలన్నీ తుస్సుమనిపించేయడమే అందుక్కారణం. ముఖ్యంగా తెలుగులో లేక లేక పెద్ద సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యాయని అమితాసక్తి ప్రదర్శించారు ప్రేక్షకులు.
గత నెలలో నాని సినిమా ‘వి’, ఈ నెలలో అనుష్క చిత్రం ‘నిశ్శబ్దం’ భారీ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలు ఆ అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాయి.
వీటితో పాటు ‘ఒరేయ్ బుజ్జిగా’ సైతం అంతగా ఆకట్టుకోలేదు. మరోవైపు తమిళంలోనూ ఓటీటీ సినిమాలకు స్పందన అంతంతమాత్రమే. ‘పెంగ్విన్’, ‘పొన్ మగల్ వందాల్’ లాంటి సినిమాలు ఆకట్టుకోలేదు. దీంతో ఓటీటీ సినిమాలంటేనే ఒక రకమైన వ్యతిరేకత పడిపోయింది ప్రేక్షకుల్లో.
ఐతే ఇలాంటి టైంలో దసరా టైంలో రిలీజవుతున్న రెండు సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అందులో ఒకటి చిన్న సినిమా కాగా.. మరొకటి పెద్దది. అక్టోబరు 23న రిలీజ్ కానున్న చిన్న సినిమా.. కలర్ ఫోటో. కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఇది. చాందిని చౌదరి, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయిరాజేష్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. ఇందులో విషయం ఉందన్న ఆశలు రేకెత్తించాయి. ఆహాలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
మరోవైపు అక్టోబరు 30న రాబోతున్న ‘ఆకాశమే నీ హద్దురా’ కూడా మంచి అంచనాలతో విడుదలవుతున్నదే. దక్షిణాదిన ఇప్పటిదాకా వచ్చిన ఓటీటీ సినిమాలన్నింట్లోకి ఇది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. దీని ప్రోమోలన్నీ ఆసక్తి రేకెత్తించేవే. చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తున్న ఈ చిత్రం ఓటీటీ సినిమాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తుందని భావిస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలు అంచనాలకు తగ్గట్లు ఉండి రాబోయే ఓటీటీ సినిమాలకు ఊపునిస్తాయేమో చూడాలి.
This post was last modified on October 19, 2020 12:25 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…