నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి కూడా దీని మీదే ఉంది. పోలీస్ బ్యాక్ డ్రాప్ చూసి ఎప్పుడో 2013లో వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ ముంబై పోలీస్ కి ఇది రీమేకనే అనుమానం ముందు నుంచి వ్యక్తమవుతూ వచ్చింది.
రెండింటికి రోషన్ ఆండ్రూస్ దర్శకుడు కావడంతో ఇది మరింత బలపడింది. అయితే టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని కొట్టివేస్తూ దేవ్ కొత్త స్టోరీ అని, ఇంతకు ముందు చూడని ట్రీట్ మెంట్ తో ఉంటుందని ఊరించింది. తీరా చూస్తే అదంతా అబద్దమే. ఈ దేవా మూల కథ ముంబై పోలీస్ దే.
దీన్నే సుధీర్ బాబు హంట్ గా తెలుగులో చేశాడు. మన ఆడియన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేని క్లైమాక్స్ ట్విస్ట్ ని యధాతథంగా ఉంచేయడంతో ఇక్కడ డిజాస్టర్ అయ్యింది. అందుకే దేవాలో తెలివిగా దీన్ని మార్చేసి సెకండాఫ్ ట్రీట్ మెంట్ పూర్తి కమర్షియల్ ఫార్మట్ లో తీసుకెళ్లారు.
అయితే షాహిద్ కపూర్ ఎంత వన్ మ్యాన్ షో చేసినా బలమైన కంటెంట్ గా దీన్ని మలచడంలో రోషన్ ఆండ్రూస్ అంతగా సక్సెస్ కాలేదు. ఎప్పుడో దశాబ్దం క్రితం రిలీజైన సినిమా మీద ప్రేమతో ఇప్పుడు కూడా దాన్నే తీయాలనుకోవడం సాహసం. దీని బదులు ఏదైనా కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకోవాల్సిందని షో అయ్యాక అనిపిస్తుంది.
కేవలం షాహిద్ కోసమే అయితే దేవాని ట్రై చేయొచ్చు కానీ ముంబై పోలీస్, హంట్ చూసిన వాళ్ళు మాత్రం దీన్ని ఎంజాయ్ చేయలేరు. పూజా హెగ్డే రొమాంటిక్ సన్నివేశాలు, జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం, యాక్షన్ ఎపిసోడ్స్ కొంత వరకు పైసా వసూల్ అనిపించినా ఓవరాల్ గా బాగుందని అనిపించుకోవడంలో దేవా తడబడ్డాడు.
బాలీవుడ్ లో ఏమైనా అద్భుతాలు చేయడం అనుమానమే. అయినా ఓటిటి ట్రెండ్ లో ఆడియన్స్ కొత్త కంటెంట్ ని డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇంకా పాత రీమేకులని పట్టుకుని వేలాడటం ఏమిటో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు. క్రియేటివిటీ అడగంటిపోతే ఇంతేనేమో.
This post was last modified on February 1, 2025 9:16 am
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం…
మాటల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్కడున్నా వారిని తనవైపు తిప్పుకోగల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం…
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…
విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…
నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…