Movie News

బన్నీ వస్తున్నాడు… ఆశించాల్సింది ఇదే

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా రాబోతున్నాడు. సంధ్య థియేటర్ దుర్ఘటన జరిగాక సుమారు రెండు నెలల తర్వాత బన్నీ ఇస్తున్న పబ్లిక్ అప్పీయరెన్స్ ఇదే. ఇంతకు ముందు ప్రెస్ మీట్లు తప్ప కనీసం సక్సెస్ మీట్ ఛాన్స్ కూడా దొరకలేదు.

కేసు నుంచి దొరికింది తాత్కాలిక ఊరటే అయినా జరిగిన ఘోరంలో తన ప్రత్యక్ష ప్రమేయం లేదు కాబట్టి కొంచెం ఆలస్యమైనా అందులో నుంచి బయటికి రావడం ఖాయమని విశ్లేషకుల అంచనా. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన అత్యంత భారీ సినిమాల్లో తండేల్ ఉండటం వల్ల అల్లు అరవింద్ ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

అందుకే తండ్రి కోసం బన్నీ తండేల్ వేడుకకు విచ్చేస్తున్నాడు. అయితే ఫ్యాన్స్ తన రాక గురించి, మాట్లాడబోయే స్పీచ్ గురించి చాలా ఆశిస్తున్నారు. కానీ అవేవి ఉండకపోవచ్చు. పుష్ప 2 ప్రస్తావన ఒకవేళ తెచ్చినా దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ కి కృతజ్ఞతలు చెప్పేసి ఎక్కువ తండేల్ గురించే మాట్లాడబోతున్నాడు.

అందులోనూ నాగ చైతన్య, సాయిపల్లవిల ప్రస్తావన ఎక్కువ ఉండబోతోంది. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్, జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుంటే మీడియాలో అదే హైలైట్ అవుతుంది. అందుకే ఆ అవసరం లేకుండా కేవలం తండేల్ ముచ్చట్లనే అల్లు అర్జున్ నుంచి రేపు ఆశించవచ్చు.

తండేల్ కోసం బన్నీ రావడం సినిమాకు హైప్ పరంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇతర భాషల్లో రీచ్ త్వరగా రావడానికి పెద్ద ప్లస్ అవుతుంది. తెలుగులో ఇబ్బంది లేదు కానీ తమిళంతో పాటు హిందీ ఆడియన్స్ ని ఓపెనింగ్స్ వైపు తిప్పాలంటే అల్లు అర్జున్ ఇమేజ్ ఖచ్చితంగా దోహదం చేస్తుంది.

చెన్నైలో కార్తీని తీసుకొచ్చింది, బాలీవుడ్లో అమీర్ ఖాన్ తోడు తీసుకుంది ఇందుకే. ఫిబ్రవరి 7 విడుదల కానున్న తండేల్ కు చాలా సానుకూలంశాలు కనిపిస్తున్నాయి. పోటీ అనుకున్న అజిత్ పట్టుదల మీద పెద్ద బజ్ లేదు. సంక్రాంతి తర్వాత ఒక్కటంటే ఒక్కటి పెద్ద సినిమా రాలేదు. సో టాక్ పాజిటివ్ వస్తే మాత్రం చైతు సిక్సర్ కొట్టొచ్చు.

This post was last modified on January 31, 2025 4:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

37 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago