బాలకృష్ణకు వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ అందించిన డాకు మహారాజ్ ఫలితం పట్ల అభిమానులు ఒకపక్క సంతోషంగానే ఉన్నారు కానీ ఒక అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోతున్నారు. కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందనే అంచనాలకు భిన్నంగా డబుల్ సెంచరీ అయినా అందుకుందో తెలియకుండానే ఫైనల్ రన్ కు దగ్గర పడటం దీనికి ప్రధాన కారణం.
అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిన్న నిర్మాణ సంస్థ ప్రకటించింది కానీ అందులో ఎలాంటి నెంబర్లు లేవు. సంక్రాంతికి వస్తున్నాం తరహాలో అంకెలను చెప్పకపోవడం చర్చకు దారి తీసింది.
ఏది ఏమైనా డాకు మహారాజ్ సినిమా అఖండ, వీరసింహారెడ్డి రేంజ్ లో ర్యాంపేజ్ చేయలేదన్నది వాస్తవం. భగవంత్ కేసరిని దాటేసింది కానీ ఇంకా మెరుగ్గా పెర్ఫార్మ్ చేయాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయం. ఈ రికార్డుల సంగతి పక్కనపెడితే కంటెంట్ లో ఉన్న ఎలివేషన్లు, హై వోల్టేజ్ యాక్షన్ వాళ్ళను శాటిస్ఫై చేసినప్పటికీ…
సగటు ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్లు, కథలో కీలక మలుపులు పూర్తి స్థాయిలో పండలేదనేది ఓపెన్ సీక్రెట్. రిలీజ్ కు ముందు నిర్మాత నాగవంశీ అన్నట్టు వాల్తేరు వీరయ్యని మించి తీయడం నిజమే అయితే దాన్ని మించిపోయేలా కలెక్షన్లు రాబట్టుకోవాలి. కానీ అలా జరగలేదు.
మొత్తంగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్ దానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. డాకు మహారాజ్ సంగతి పక్కనపెడితే డబుల్ సెంచరీ సాధించే సత్తా అఖండ 2 తాండవంకి నూరు శాతం ఉంది. ఈసారి పక్కా ప్లానింగ్ తో ఒకేసారి ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు.
ఇలా చేయకపోవడమే డాకుకి దెబ్బయ్యింది. హిందీ వెర్షన్ ఆలస్యంగా రిలీజ్ చేయడం వల్ల ఓపెనింగ్స్ సమస్యతో పాటు పైరసీ లీక్ లాంటి అడ్డంకులు దీనికీ తప్పలేదు. ప్రమోషన్ల పరంగా ఏ లోటు లేకుండా ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అన్ని చేశారు కానీ ల్యాండ్ మార్క్ అవ్వాల్సిన మూవీ సూపర్ హిట్ దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది.
This post was last modified on January 31, 2025 10:01 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…