ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మార్చి సీతారామరాజు టీజర్ రావడానికి ముందు మరీ అంచనాలేమీ లేవు. అందుకు ప్రధాన కారణం ఆ టీజర్ వస్తుందని కొన్ని రోజుల ముందు వరకు తెలియదు. దాని కోసం చాన్నాళ్ల ఎదురు చూపులేమీ లేవు. లాక్ డౌన్ వల్ల పని లేక ఖాళీ అయిపోయిన చిత్ర బృందం ఉన్నట్లుండి టీజర్ గురించి ప్రకటించింది. రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు దాన్ని రిలీజ్ చేసింది.
రాజమౌళి స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ఆ టీజర్ ఉండి ఇటు మెగా అభిమానుల్ని, అటు నందమూరి ఫ్యాన్స్‌ను అలరించింది. చరణ్ విజువల్స్ పరంగా వావ్ అనిపిస్తే.. తారక్ వాయిస్‌తో మెస్మరైజ్ చేశాడు. ఇక అప్పట్నుంచి తారక్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
సీతారామరాజు టీజర్ అదిరిపోవడం, కొమరం భీమ్ టీజర్ కోసం చాన్నాళ్లు ఎదురు చూడటం వల్ల టీజర్‌పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ టీం మళ్లీ షూటింగ్‌కు వెళ్లింది. వెంటనే భీమ్ టీజర్ విజువల్స్ మీద దృష్టిపెట్టింది. ఈ నెల 22న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో అభిమానులు కౌంట్‌డౌన్‌లు మొదలుపెట్టేశారు. వారి ఉత్సాహాన్ని ఇంకా పెంచుతూ.. ఆర్ఆర్ఆర్ టీం సైతం కౌంట్ డౌన్లు నడుపుతూ.. ఇంకో ఐదు రోజుల్లో, ఇంకో నాలుగు రోజుల్లో అంటూ ఊరిస్తూ వస్తోంది.
టీజర్‌కు రోజులు దగ్గరపడేకొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటు తారక్ స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అతడి ఫ్యాన్స్, అటు చరణ్ వాయిస్ ఓవర్ విషయంతో తన అభిమానులు భారీ అంచనాలతోనే ఉన్నారు. వాటిని రీచ్ కావడం అంత తేలిక కాదు.ఐతే తనపై ప్రేక్షకులు ఎంత అంచనాలు పెట్టుకున్నా దాన్ని బర్డెన్‌లాగా ఫీలవకుండా ఇంకా బాగా పని చేసి వారిని మెస్మరైజ్ చేయడం జక్కన్నకు అలవాటు. మరి భీమ్ టీజర్ విషయంలోనూ అలాగే చేస్తాడేమో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:54 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…