సినిమాల ఎంపికలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి హీరోలకు భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయి. అంటే డబ్బు రూపంలో కాదు. ఫలితాలను ఎదురుకునే విషయంలో. సూర్యని చూస్తుంటే అదే అనిపిస్తోంది. నిన్న రిలీజైన పరాశక్తి టీజర్ చూశాక తన ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ముందు ప్రకటించింది సూర్యతోనే.
ఆకాశం నీ హద్దురా కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకురాలు సుధా కొంగర ఆయన్నే ఒప్పించింది. కానీ కంటెంట్ లో ఉన్న సున్నితత్వం వివాదాస్పదం అవుతుందేమోనని భావించిన సూర్య మెల్లగా దాన్నుంచి తప్పుకుని శివ కార్తికేయన్ కు దారి ఇచ్చాడు.
తీరా చూస్తే పరాశక్తి టీజర్ అదిరిపోయిందనే టాక్ తెచ్చుకుంది. దశాబ్దాల క్రితం జరిగిన సంచలనాత్మక సంఘటనలు తీసుకుని సుధా కొంగర ఇచ్చిన ట్రీట్ మెంట్ హీరోతో పాటు శ్రీలీల, అధర్వ, రవి మోహన్ ఇలా అందరినీ ఎలివేట్ చేసింది. ఒకవేళ శివ కార్తికేయన్ స్థానంలో సూర్య ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయేది.
దీని స్థానంలో ఇంకా దర్శకుడిగా పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకోని ఆర్జె బాలాజీకి సూర్య ఛాన్స్ ఇవ్వడం పట్ల అభిమానుల్లో డౌట్ లేకపోలేదు. ఇదే కాదు కంగువ కూడా సూర్య తీసుకున్న బ్యాడ్ డెసిషన్ గా ఫీలవుతూ ఉంటారు. సిరుతై శివని అంత గుడ్డిగా నమ్మడం డిజాస్టర్ ఇచ్చిందని వాళ్ళ ఫీలింగ్.
ఇవే కాదు వెంకీ అట్లూరితో ప్రాజెక్టు కూడా సూర్యకు మిస్ అయ్యిందని చెన్నై టాక్. దీని స్థానంలోనే ధనుష్ తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్న అట్లూరి త్వరలోనే దాన్ని మొదలుపెట్టొచ్చు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్య ఆశలన్నీ ప్రస్తుతం రెట్రో మీదే ఉన్నాయి.
కార్తీక్ సుబ్బరాజ్ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉన్నాడని టీజర్ లో అనిపించింది. అలాని అతిగా ఆశించలేం. ఇదే దర్శకుడు జగమే తంతిరం లాంటి ఖంగాళీ సినిమా ఇచ్చాడు. సో ప్రతిదీ పేట, జిగర్ తండా అవ్వకపోవచ్చు. ఇంకోవైపు విడుదల పార్ట్ 2తో ఫ్లాప్ చవి చూసిన వెట్రిమారన్ తో సూర్య వాడివసల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
This post was last modified on January 30, 2025 9:49 am
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…