టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త యలపర్తి నారాయణ చౌదరి, రాజేశ్వరిదేవిల కుమార్తెను సురేశ్ బాబు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సురేశ్ బాబు అత్త గారైన రాజేశ్వరి దేవి బుధవారం కన్నుమూశారు. దీంతో సురేశ్ ఫ్యామిలీ మొత్తం హుటాహుటీన తణుకు చేరింది. రాజేశ్వరి దేవి అంత్యక్రియల్లో పాలుపంచుకుంది.
ఈ సందర్భంగా తన అమ్మమ్మ పాడెను సురేశ్ బాబు కుమారుడు, నటుడు రానా దగ్గుబాటి తన భుజంపై మోశారు. ఇదిలా ఉంటే.. రాజేశ్వరి దేవి తనయుడు, రానా మేనమామ గారైన దివంగత వైటీ రాజా గతంలో తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటు పారిశ్రామిక రంగంతో పాటుగా ఇటు రాజకీయంగానూ యలపర్తి ఫ్యామిలీ రాణించిన నేపథ్యంలో రెండు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తణుకు చేరుకుని రాజేశ్వరి దేవికి నివాళి అర్పించారు. వీరిలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు కూడా ఉన్నారు.
This post was last modified on January 30, 2025 9:47 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…