ఈ రోజుల్లో ఎంత గొప్ప సినిమా వచ్చినా.. దాని గురించి సోషల్ మీడియాలో ఒక నెగెటివ్ ప్రచారం జరగడం మామూలైపోయింది. కొన్ని సినిమాలు ఈ ప్రాపగండాను తట్టుకుని నిలబడుతున్నాయి. కొన్ని దెబ్బ తింటున్నాయి. సినిమా రివ్యూలు కూడా చాలా వరకు మిక్స్డ్‌గా ఉంటున్నాయి. పూర్తి పాజిటివ్ టాక్ తెచ్చుకునే సినిమాలు అరుదుగానే ఉంటున్నాయి.
ఈసారి సంక్రాంతికి రిలీజైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం.. ఈ మూడు కూడా యావరేజ్, ఎబోవ్ యావరేజ్ రివ్యూలే తెచ్చకున్నాయి. కానీ వీటిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎవ్వరూ ఊహించని స్థాయి బ్లాక్ బస్టర్ కాగా.. ‘డాకు మహారాజ్’ కూడా హిట్ అయింది. ‘గేమ్ చేంజర్’ దెబ్బ తింది. ఈ నేపథ్యంలో రివ్యూలు, సోషల్ మీడియా నెగెటివిటీ గురించి ‘డాకు మహారాజ్’ దర్శకుడు బాబి కొల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
‘‘ఒకప్పుడు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు సరదాగా మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అది సీరియస్ సమస్యగా మారింది. సినిమా మొదలవగానే థియేటర్ నుంచి ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఏ ఇద్దరి అభిప్రాయం ఒకలా ఉండదు. అలాంటపుడు మన అభిప్రాయాన్ని పది మంది అంగీకరించాలని ఎందుకు అనుకోవాలి. కొన్ని రోజులు ఆగితే అసలు రివ్యూ తెలుస్తుంది అనుకోవచ్చు.
సినిమా అంటే ఒక వ్యక్తి జీవితం కాదు. వందల మంది కష్టం. నా సినిమా సెట్స్‌లోనే 400 మంది పని చేస్తారు. ఇంతమంది శ్రమను ఒక్క మాటతో చంపేయడం చాలా తప్పు. ప్రస్తుతం సినిమాను బలవంతంగా చంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాను వచ్చినపుడు కూడా రాజమౌళిని ట్రోల్ చేశారు. ఆ సినిమాలో కథ లేదని రివ్యూలు రాశారు. కానీ చివరికి ఆ చిత్రం ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది.
అలాంటి వ్యక్తినే ట్రోల్ చేసినపుడు నేనెంత అనుకుంటాను. మన సినిమాలో దమ్ముంటే అది చరిత్ర సృష్టిస్తుంది. చిరంజీవితో నేను చేసిన ‘వాల్తేరు వీరయ్య’కు తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ అది బ్లాక్ బస్టర్ అయింది’’ అని బాబీ అన్నాడు.
This post was last modified on January 29, 2025 8:52 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…