టాలీవుడ్ టాప్ రేటెడ్ సంగీత దర్శకుడిగా పీక్స్ చూస్తున్న తమన్ మేకప్ వేసుకునే ఆర్టిస్ట్ అయిపోయాడు. తమిళంలో ఆకాష్ భాస్కరన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న సినిమాలో ఒక కీలక పాత్ర దక్కించుకున్నాడు. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతోంది. అథర్వ మురళి మెయిన్ హీరో. మమిత బైజు హీరోయిన్ గా చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు టీమ్ బయటికి చెప్పడం లేదు కానీ గుట్టుచప్పుడు కాకుండా షూట్ కానిస్తున్నారని సమాచారం. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరికొన్ని కీలక వివరాలు చెప్పబోతున్నారు. తమన్ కు సంబంధించి ఈ ప్రాజెక్ట్ స్పెషల్ కానుంది.
ఎందుకంటే ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సహాయకుడిగా పని చేస్తున్నప్పుడు దర్శకుడు శంకర్ బాయ్స్ ఛాన్స్ ఇచ్చాడు. సిద్దార్థ్ తో పాటు నటించిన కుర్ర హీరోల గ్యాంగ్ లో బొద్దుగా మెప్పించాడు. యాక్టింగ్ పరంగా చెప్పుకోవడానికి మరీ ఎక్కువ లేకపోయినా క్యారెక్టర్ కు తగ్గట్టు మంచి ఛాయస్ అనిపించాడు. తర్వాత సంగీత ప్రపంచంలో బిజీ అయ్యాక తమన్ మళ్ళీ మేకప్ వేసుకునే అవకాశం రాలేదు. దేవిశ్రీ ప్రసాద్ లాగే కేవలం తెరవెనుకే పరిమితమయ్యాడు. ఇండియన్ ఐడల్ లాంటి టాలెంట్ షోలకు గెస్టుగా రావడం తప్పించి కెమెరా ముందుకు తమన్ వచ్చిన సందర్భాలు తక్కువ.
ఇప్పుడీ తమిళ చిత్రం ద్వారా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతాడేమో చూడాలి. అన్నట్టు దీని దర్శకుడు ఆకాష్ భాస్కరన్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో పరాశక్తి చేస్తున్న సుధా కొంగర బృందంలోని సభ్యుడే. కొత్త తరహా కంటెంట్ తో అధర్వ మురళి, తమన్ పాత్రలను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. సంగీతం ఎవరు ఇస్తున్నారో వేరే చెప్పనక్కర్లేదు. గత కొన్నేళ్లుగా తమన్ డిమాండ్ బాగా పెరిగింది. అఖండ నుంచి డాకు మహారాజ్ దాకా మంచి ఫామ్ చూస్తున్నాడు. కుర్చీ మడతపెట్టి గత ఏడాది ఇండియన్ యూట్యూబ్ లో అగ్ర స్థానం సంపాదించుకుంది. మరి నటుడిగా ఎలా మెప్పిస్తాడో ఎలా కనిపిస్తాడో చూడాలి.
This post was last modified on January 29, 2025 5:39 pm
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…