గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన ‘పుష్ప: ది రూల్’ సినిమా.. అతి త్వరలోనే బుల్లితెరపైకి వస్తోంది. ఈ నెల 30న నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది ‘పుష్ప-2’. ఈ చిత్రం మొదట థియేటర్లలో 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైంది. ఎడిటింగ్ చివరి దశలో హడావుడిగా జరగడం.. నిడివిని కుదించే క్రమంలో కొన్ని కీలక సన్నివేశాలు లేచిపోయాయి. వాటిని జోడించి సంక్రాంతి టైంలో రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.
20 నిమిషాల అదనపు సన్నివేశాలు తోడవడంతో సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ రాబోతుండగా.. రీలోడెడ్ వెర్షన్‌నే ఇక్కడ కూడా చూపించబోతున్నారని భావిస్తున్నారంతా. కానీ డిజిటల్ వెర్షన్‌లో మరి కొన్ని సన్నివేశాలు కలవబోతుండడం విశేషం.
రీలోడెడ్ వెర్షన్లో కూడా లేని కొన్ని సన్నివేశాలు ఓటీటీ ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. దాదాపు మూడున్నర నిమిషాల ఎక్స్‌ట్రా సీన్లు ఈ వెర్షన్లో ఉండబోతున్నాయి. దీని వల్ల మొత్తం నిడివి 3 గంటల 44 నిమిషాలకు చేరబోతోంది. మరి రీలోడెడ్ వెర్షన్లో కూడా లేని అదనపు సీన్లు ఏవి అన్నది ఆసక్తికరం. మొత్తానికి ఇప్పుడు థియేటర్లలో నడుస్తున్నది కూడా ‘పుష్ప-2’ కంప్లీట్ వెర్షన్ కాదన్నమాట. ఓటీటీ వెర్షన్ కోసం ప్రేక్షకులను ఆకర్షించేందుకు మరి కొన్ని సన్నివేశాలు అట్టిపెట్టాడన్నమాట సుకుమార్.
థియేటర్లలోనే కాక డిజిటల్‌గానూ ‘పుష్ప-2’ మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు రికార్డు వ్యూస్ రావడం ఖాయం. ముఖ్యంగా థియేటర్లలో ఈ సినిమాను ఎగబడి చూసిన నార్త్ ఇండియన్స్.. ఓటీటీలో చూసేందుకు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారనడంలో సందేహం లేదు. డిజిటల్ హక్కుల కోసం భారీ పెట్టుబడి పెట్టిన నెట్ ఫ్లిక్స్.. వ్యూయర్‌షిప్‌లో కొత్త రికార్డులు నమోదవుతాయని, సబ్‌స్క్రిప్షన్లు బాగా పెరుగుతాయని ఆశిస్తోంది.
This post was last modified on January 29, 2025 3:15 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…