అసలు ఏ దశలో ఉందో, ఎక్కడ జరుగుతోందో కనీసం క్లూ కూడా ఇవ్వకుండా రాజమౌళి మొదలుపెట్టిన ఎస్ఎస్ఎంబి 29 ఒక చిన్న వీడియోతో ఎంత మార్కెటింగ్ చేసుకుందో చూశాం. లీకులు కాకుండా టీమ్ తీసుకున్న జాగ్రత్తలు ఫలితాన్ని ఇస్తున్నాయి. వర్క్ షాప్స్, ఫోటో షూట్స్, ఓపెనింగ్ పూజా ఇలా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఒక్క ఫోటో బయటికి రాలేదంటే సెక్యూరిటీ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్ డేట్స్ కోసం ఎంత వేడుకున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇక అసలు పాయింట్ కొద్దాం.
వెయ్యి కోట్ల బడ్జెట్ అంచనాగా చెప్పబడుతున్న ఈ ప్యాన్ వరల్డ్ మూవీలో ప్రియాంకా చోప్రా ఆల్రెడీ లాకైన సంగతి తెలిసిందే. అయితే తను మహేష్ సరసన హీరోయిన్ కాదనేది లేటెస్ట్ న్యూస్. చాలా కీలకమైన పాత్ర కాబట్టే ఒప్పుకుందని వినికిడి. ఇదిలా ఉండగా మలయాళ నటుడు సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ ఇందులో నటిస్తాడనే టాక్ నెలల క్రితమే బయటికి వచ్చింది.
కానీ డేట్ల సర్దుబాటు సమస్య వల్ల ఇప్పుడు తన స్థానంలో ధూమ్ విలన్ జాన్ అబ్రహం వస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇటీవలే చర్చలు జరిగినట్టు తెలిసింది. అఫీషియల్ న్యూస్ వచ్చేదాకా ఆగాలి.
అంటే జాన్ అబ్రహం, ప్రియాంకా చోప్రా ఒక జంటగా కనిపిస్తారన్న మాట. సో జక్కన్న ఊహకందనిది ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. అడవి నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న రాజమౌళి ఏడాదిన్నరలోపే పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకున్నారట.
అయితే ఆర్ఆర్ఆర్ లాగా ఒక భాగమే ఉంటుందా లేక బాహుబలి తరహాలో సీక్వెల్ ప్లాన్ చేశారా అనేది ప్రెస్ మీట్ లో ఆయనే స్వయంగా చెబితే తప్ప క్లారిటీ రాదు. ఇదంతా నిజమే అయినా పక్షంలో మహేష్ బాబు సరసన కనిపించే అదృష్టవంతురాలు ఎవరో వేచి చూడాలి. లీకులతోనే హైప్ ఎక్కడికో వెళ్ళిపోతోంది.
This post was last modified on January 29, 2025 11:58 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…