దేవర పార్ట్ 1 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చేసింది. రాజమౌళి యాంటీ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ఆర్ఆర్ఆర్ తర్వాత ఇంత విజయం సాధించడం చూసి వాళ్ళ ఆనందం మాములుగా లేదు. అయితే ఇదంతా జరిగి నాలుగు నెలలు దాటుతోంది.
దేవర 2కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు. తారక్ అటు వార్ 2 షూటింగ్ లో బిజీ ఉన్నాడు. ఇటువైపు తర్వాతి సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాడు. ఇంకో రెండు మూడు వారాల్లోకి చిత్రీకరణ మొదలు కానుంది. ఈ ఏడాది మొత్తం దానికే గడిచిపోతుంది.
ఇక దేవర 2 విషయానికి వస్తే కొరటాల శివ పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసి దేవర ఎలా చనిపోయాడనే పాయింట్ తో పాటు వర అసలు రూపం బయట పడ్డాక సైఫ్ అలీ ఖాన్ పోషించిన భైరని ఎదురుకునే వైనాన్ని చాలా టెర్రిఫిక్ గా డిజైన్ చేస్తున్నారట.
కెజిఎఫ్ 2, బాహుబలి 2, పుష్ప 2 తరహాలో గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్స్ మూడు నాలుగు సిద్ధం చేస్తున్నట్టు వినికిడి. రెండో భాగంలోనూ పెద్ద దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ గంటకు పైగానే ఉండొచ్చని సమాచారం. జాన్వీ కపూర్ ట్రాక్ కూడా సీక్వెల్ లోనే కీలకం కానుంది.
సైఫ్ తో పాటు మరో విలన్ గా బాబీ డియోల్ దేవర 2లో భాగం కావడం దాదాపు ఖరారే. బయటికి చెప్పలేదు కానీ యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట పక్కానే అంటోంది. సముద్రంలో కళేబరాలు, దేవర అదృశ్యం, భైర చేసిన అరాచకాలు, ఎర్ర సముద్రం మీద జరిగిన యుద్ధాలు వగైరాలన్నీ ఇందులో పొందుపరచబోతున్నారు.
అనిరుద్ రవిచందర్ దేవర 1కి ఇచ్చిన పాటలు తక్కువే అయినా అన్నీ ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. దేవర 2లో ఈసారి అయిదు సాంగ్స్ ఉంటాయని మరో టాక్. ఇదంతా ఎలా ఉన్నా 2027 కన్నా ముందు దేవర 2 దర్శనం జరిగే అవకాశం తక్కువే. నిర్ణయం ఏదైనా అనూహ్యంగా మారితే తప్ప.
This post was last modified on January 29, 2025 10:40 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…