టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ కొత్త చిత్రం ‘లైలా’లో ఆకాంక్ష శర్మ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మోడలింగ్, మ్యూజికల్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ అమ్మాయి గురించి ఇప్పుడు అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. మామూలుగా తొలి సినిమా హిట్టయ్యాక హీరోయిన్లకు వరుసగా అవకాశాలు రావడం మామూలే. కానీ ఆకాంక్షకు మాత్రం తొలి సినిమా రిలీజ్ ముంగిటే అవకాశాలు వరుస కడుతున్నాయి.
ఇప్పటికే ఆమె నాలుగు చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. ఇందులో ముందుగా రిలీజ్ కాబోయేది ‘లైలా’నే కాబట్టి అదే తన డెబ్యూ మూవీగా భావించాలి. దీని తర్వాత కొంచెం కొంచెం గ్యాప్‌లో ఇదే ఏడాది ఆమె సినిమాలు మరో మూడు విడుదల కాబోతుండడం విశేషం. తెలుగులో అరంగేట్రం చేయడానికి ముందే ఆకాంక్ష హిందీలో మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
అందులో ఒకటి సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ లాంటి పెద్ద హీరోలు నటిస్తున్న ‘కేసరి వీర్’. ఇదొక పీరియడ్ మూవీ. ఇందులో ఆకాంక్షకు ముఖ్యమైన పాత్రే దక్కినట్లు సమాచారం. ఇంకోవైపు మిలప్ జవేరి రూపొందిస్తున్న ‘తేరా యార్ హూ మై’ అనే రొమాంటిక్ మూవీలోనూ ఆకాంక్ష నటిస్తోంది. ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం ఇదే. ఇందులో అమన్ ఇంద్ర కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో ఆకాంక్ష నటనకు ఫిదా అయిన దర్శకుడు మిలప్ జవేరి.. తాను డైరెక్ట్ చేయనున్న మరో సినిమాలో కూడా ఛాన్స్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలతో పాటు మూడో సినిమా కూడా ఈ ఏడాదే విడుదలవుతుందట. ఇలా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకోవడం అరుదైన విషయమే. ఇటీవలే ‘లైలా’ నుంచి రిలీజ్ చేసిన ఓ పాటలో ఆకాంక్ష అందాల ఆరబోతతో కుర్రాళ్ల దృష్టిని బాగానే ఆకర్షించింది.
This post was last modified on January 28, 2025 6:41 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…