మాములుగా టాలీవుడ్ బాక్సాఫీస్ ఫిబ్రవరి నెలని కొంచెం డ్రైగా భావిస్తుంది. ఎందుకంటే పిల్లలకు పరీక్షలు, ఉద్యోగులకు ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు దగ్గరగా ఉంటుంది కాబట్టి సినిమాల పరంగా జనంలో అంతగా ఆసక్తి ఉండదు. స్టార్ హీరోలు అసలే దూరంగా ఉంటారు. కానీ మిడ్ రేంజ్ మూవీస్ కి వర్కౌట్ చేసుకోవచ్చు. కాకపోతే కంటెంట్ బాగుండాలి.
ఈసారి పోటీ మాములుగా ఉండటం లేదు. ముందుగా ఏడో తేదీ నాగచైతన్య ‘తండేల్’ భారీ అంచనాల మధ్య దిగుతోంది. బడ్జెట్, క్యాస్టింగ్, బ్యాక్ డ్రాప్ పరంగా చూసుకుంటే ఏ ప్యాన్ ఇండియా మూవీకి తీసిపోని రీతిలో మార్కెటింగ్ చేస్తున్నారు. చైతుకిది చాలా కీలకం.
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత గ్యాప్ వచ్చేసింది కాబట్టి బయ్యర్ల ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ఒకరోజు ముందు ఆరో తేదీనే వస్తున్న అజిత్ డబ్బింగ్ మూవీ ‘పట్టుదల’ టాక్ మీదే ఆధారపడాలి. ఫిబ్రవరి 14 విశ్వక్ సేన్ ‘లైలా’ మీద క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. ఆడ గెటప్ లో ఈ మధ్య కాలంలో యూత్ హీరోలెవరూ రిస్క్ చేయలేదు. మరి ఇది ఎంతవరకు పే చేస్తుందో చూడాలి.
‘క’తో కంబ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ యూత్ ని టార్గెట్ చేసుకుంది. టీజర్, పాటలు చూస్తుంటే ప్రామిసింగ్ గానే అనిపిస్తోంది. బ్రహ్మానందం, ఆయనబ్బాయి గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మ ఆనందం’ కామెడీని నమ్ముకుని వస్తోంది. విక్కీ కౌశల్ – రష్మిక మందన్న ‘చావా’ని తక్కువంచనా వేయడానికి లేదు.
సందీప్ కిషన్ దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబోలో ఫిబ్రవరి 21న వస్తున్న ‘మజాకా’ మీద బజ్ పెరుగుతోంది. టీజర్ లో హామీ అయితే దొరికింది. అదే రోజు లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ తమిళంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ రిలీజవుతోంది. దీంతో పాటు ధనుష్ డైరెక్ట్ చేసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ కూడా షెడ్యూల్ చేశారు కానీ చెన్నై వర్గాలు వాయిదా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా యువతను లక్ష్యంగా పెట్టుకున్నదే. బ్రహ్మాజీ ‘బాపు’ కూడా వీటితో పాటు పోటీ పడనుంది. మొత్తానికి ఫిబ్రవరి నెలలో కాంపిటీషన్ మాములుగా లేదు. వీటిలో విజేతలెవరో పరాజితులెవరో చూడాలి.
This post was last modified on January 28, 2025 4:44 pm
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…