Movie News

‘గేమ్ చేంజర్’ రిజల్ట్ పై స్పందించిన నటి…

ఈ సంక్రాంతికి రిలీజైన మూడు చిత్రాల్లో స్టార్ కాస్ట్, బడ్జెట్, బిజినెస్.. ఇలా అన్ని రకాలుగా పెద్ద సినిమా అంటే ‘గేమ్ చేంజర్’యే. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయినప్పటికీ.. సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజవుతున్న ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే ఆశించారు మెగా అభిమానులు. కానీ శంకర్ చివరి చిత్రం ‘ఇండియన్-2’ కంటే బెటర్ అనే టాక్ తెచ్చుకుంది కానీ.. అంతకుమించి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు.

కానీ సంక్రాంతి సీజన్, కాంబినేషన్ క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ తర్వాత సినిమా నిలబడలేకపోయింది. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దూకుడు మొదలయ్యాక ‘గేమ్ చేంజర్’ పూర్తిగా వెనుకబడిపోయింది. బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఈ సినిమా ఫ్లాప్ అనడంలో సందేహం లేదు. ఐతే సంక్రాంతి టైం కాబట్టి ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఉంది. స్క్రీన్లు తగ్గాయి కానీ.. రన్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ టీం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. సినిమా థియేటర్లలో ఉండగా రిజల్ట్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. కానీ ఈ చిత్రంలో ఒక కథానాయికగా నటించిన అంజలి పరోక్షంగా ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ గురించి ఒప్పేసుకుంది. తమిళంలో సంక్రాంతికే రిలీజై సూపర్ హిట్ అయిన తన పాత చిత్రం ‘మదగజ రాజా’ తెలుగులోనూ విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న అంజలికి ‘గేమ్ చేంజర్’ గురించి ప్రశ్న ఎదురైంది. అక్కడ ‘మదగజ రాజా’ బాగా ఆడింది, ఇక్కడ ‘గేమ్ చేంజర్’ కూడా అలాగే ఆడి ఉంటే బాగుండేది కదా అని అడిగితే..

‘‘గేమ్ చేంజర్ నేను చాలా ఇష్టపడి చేసి సినిమా. దాని కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టాను. సినిమా చూసిన వాళ్లందరూ అది మంచి సినిమా అన్నారు. ఎవ్వరూ బాగా లేదని చెప్పలేదు. దాని ఫలితం గురించి మాట్లాడాలంటే ఇంకో ప్రెస్ మీట్, అరగంటకు పైగా సమయం అవసరం. కానీ ఆ సినిమా విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను’’ అంటూ ‘గేమ్ చేంజర్’ రిజల్ట్ తనను నిరాశకు గురి చేసినట్లు చెప్పకనే చెప్పింది అంజలి.

This post was last modified on January 28, 2025 2:55 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

22 minutes ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

52 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

2 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

3 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

3 hours ago