ఈ రోజుల్లో ఆడియో క్యాసెట్లు, సీడీలు లేవు. వాటి అమ్మకాలూ లేవు. ఆడియో ఫంక్షన్లూ లేవు. అలాంటపుడు ఆడియోలకు ఏం ప్రాధాన్యం ఉందిలే అనుకుంటాం. కానీ సినిమాలకు బజ్ క్రియేట్ చేయడంలో పాటల ప్రాధాన్యం విస్మరించలేనిది. కేవలం ఒక పాట వల్ల బజ్ క్రియేట్ అయి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాలు ఎన్నెన్నో. సిద్ శ్రీరామ్ పాటలు ఇలా చాలాసార్లు మ్యాజిక్ క్రియేుట్ చేశాయి. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ చేయడంలో ‘గోదారి గట్టు మీద..’ పాట ఎంత కీలక పాత్ర పోషించిందో తెలిసిందే.
టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘తండేల్’ విషయంలో కూడా పాటలు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఈ సినిమాకు ఆల్రెడీ ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మొదట ఈ సినిమా ఫస్ట్ టీజర్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది.ఇక గత కొన్ని వారాల నుంచి రిలీజ్ చేస్తున్న ఒక్కో పాట సినిమా మీద హైప్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. మొదటగా రిలీజ్ చేసిన బుజ్జి తల్లి పాట.. ఆ తర్వాత వచ్చిన శివ శక్తి.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘హైలెస్సో హైలెస్సో’.. వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి.
ఈ మూడు పాటలూ కలిపి అప్పుడే 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నాయి యూట్యూబ్‌లో. రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో వ్యూస్ రావడం అనూహ్యం. తండేల్ పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో.. చూడ్డానికి కూడా అంతే బాగున్నాయి. లిరికల్ వీడియోల్లో చిన్న చిన్న గ్లింప్స్‌లతోనే పాటలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. చైతూ, సాయిపల్లవిల స్క్రీన్ ప్రెజెన్స్.. కెమిస్ట్రీ అదిరిపోయింది.
ఇక సాయిపల్లవి స్టెప్స్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. ‘బుజ్జి తల్లి’ పాట అయితే గత కొన్ని రోజులుగా మ్యూజిక్ ఛార్ట్స్‌ను ఊపేస్తోంది. వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్‌ను గుర్తు చేసేలా మంచి ఫీల్‌తో, వినసొంపుగా సాగిన ఈ పాట ఒక్కటి చాలు సినిమాకు ప్రేక్షకులను పరుగులు పెట్టించడానికి. పాటలు బాగుంటే సినిమాకు ఎలా హైప్ క్రియేట్ అవుతుందనడానికి ‘తండేల్’ లేటెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.
This post was last modified on January 28, 2025 9:58 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…