Movie News

పాటలు క్లిక్ అయితే ఇలా ఉంటుంది

ఈ రోజుల్లో ఆడియో క్యాసెట్లు, సీడీలు లేవు. వాటి అమ్మకాలూ లేవు. ఆడియో ఫంక్షన్లూ లేవు. అలాంటపుడు ఆడియోలకు ఏం ప్రాధాన్యం ఉందిలే అనుకుంటాం. కానీ సినిమాలకు బజ్ క్రియేట్ చేయడంలో పాటల ప్రాధాన్యం విస్మరించలేనిది. కేవలం ఒక పాట వల్ల బజ్ క్రియేట్ అయి మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాలు ఎన్నెన్నో. సిద్ శ్రీరామ్ పాటలు ఇలా చాలాసార్లు మ్యాజిక్ క్రియేుట్ చేశాయి.

సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ చేయడంలో ‘గోదారి గట్టు మీద..’ పాట ఎంత కీలక పాత్ర పోషించిందో తెలిసిందే. టాలీవుడ్ నెక్స్ట్ బిగ్ రిలీజ్ ‘తండేల్’ విషయంలో కూడా పాటలు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ఈ సినిమాకు ఆల్రెడీ ఫుల్ పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మొదట ఈ సినిమా ఫస్ట్ టీజర్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది.

ఇక గత కొన్ని వారాల నుంచి రిలీజ్ చేస్తున్న ఒక్కో పాట సినిమా మీద హైప్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్తున్నాయి. మొదటగా రిలీజ్ చేసిన బుజ్జి తల్లి పాట.. ఆ తర్వాత వచ్చిన శివుడి.. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘హైలెస్సో హైలెస్సో’.. వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ మూడు పాటలూ కలిపి అప్పుడే 100 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నాయి యూట్యూబ్‌లో. రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో వ్యూస్ రావడం అనూహ్యం.

తండేల్ పాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయో.. చూడ్డానికి కూడా అంతే బాగున్నాయి. లిరికల్ వీడియోల్లో చిన్న చిన్న గ్లింప్స్‌లతోనే పాటలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. చైతూ, సాయిపల్లవిల స్క్రీన్ ప్రెజెన్స్.. కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇక సాయిపల్లవి స్టెప్స్ గురించైతే చెప్పాల్సిన పని లేదు. ‘బుజ్జి తల్లి’ పాట అయితే గత కొన్ని రోజులుగా మ్యూజిక్ ఛార్ట్స్‌ను ఊపేస్తోంది.

వింటేజ్ దేవిశ్రీ ప్రసాద్‌ను గుర్తు చేసేలా మంచి ఫీల్‌తో, వినసొంపుగా సాగిన ఈ పాట ఒక్కటి చాలు సినిమాకు ప్రేక్షకులను పరుగులు పెట్టించడానికి. పాటలు బాగుంటే సినిమాకు ఎలా హైప్ క్రియేట్ అవుతుందనడానికి ‘తండేల్’ లేటెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.

This post was last modified on January 28, 2025 8:02 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

39 minutes ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

9 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

10 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago