Movie News

ఇళయరాజాని కామెంట్ చేసే స్థాయి మీకుందా

భాషతో సంబంధం లేకుండా ప్రపంచమంతా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న మాస్ట్రో ఇళయరాజా ఇప్పటి 5జి జనరేషన్ సంగీత ప్రియులకు సైతం ఆరాధ్యనీయులు. తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటి లెజెండరీ మీద ఎవరైనా కామెంట్ చేస్తే కోపం రావడం సహజం.

డిటెక్టివ్, పిశాచి, సైకో లాంటి సినిమాల ద్వారా మనకూ పరిచయమున్న దర్శకుడు, నటుడు మిస్కిన్ ఈ తప్పు చేశారు. బాటిల్ రాధ అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇళయరాజా మీద చేసిన కామెంట్లు ఇంటా బయటా తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.

తన ప్రసంగంలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాజా సంగీతం విని మద్యానికి బానిసైన వాళ్ళు ఎందరో ఉన్నారని, ఆరోగ్యాలు పాడు చేసుకున్నారని అన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా అర్థం మాత్రం పూర్తి నెగటివ్ గా వచ్చేసింది.

అంటే ఇళయరాజా పాటలు వినే పబ్లిక్ బార్లకు వెళ్ళేవాళ్ళనే కోణంలో మీనింగ్ రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా నెటిజెన్లు భగ్గుమన్నారు. జరిగిన తప్పు తెలుసుకున్న మిస్కిన్ వెంటనే క్షమాపణ చెప్పారు కానీ ఆలోగానే చాలా డ్యామేజ్ అయిపోయింది. ఈయన సైకోకి సంగీతం ఇచ్చింది ఇళయరాజానే.

హీరో విశాల్ తీవ్రంగా స్పందిస్తూ గొప్ప వ్యక్తులను కించపరిచేలా మాట్లాడ్డంలో మిస్కిన్ ఎప్పటి నుంచో ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టాడు. ఇళయరాజాని అనేంత స్థాయి మిస్కిన్ కు లేదని సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పుగా మారదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడో విషయాన్ని గుర్తు చేసుకోవాలి.

డిటెక్టివ్ 2 తీస్తున్న టైంలోనే విభేదాలు తలెత్తి ఆ ప్రాజెక్టు నుంచి మిస్కిన్ బయటికి వచ్చాడు. విశాల్ స్వయంగా దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. అయినా మిస్కిన్ ఇలా నోరు జారడం ఇదే మొదటిసారి కాదు. కొట్టుకలి ఈవెంట్ లో ఈ సినిమా ఆడకపోతే నగ్నంగా నిలబడతానని స్టేట్ మెంట్ ఇచ్చి కాంట్రావర్సి రేపాడు.

This post was last modified on January 27, 2025 12:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

7 నెలలు.. రూ.6.33 లక్షల కోట్లు.. 4.1 లక్షల ఉద్యోగాలు

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…

1 hour ago

పార్టీ అభిప్రాయమే ఫైనల్ అంటోన్న నాగబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…

2 hours ago

అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పు చేస్తున్నాం: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…

3 hours ago

ఛాంపియన్స్ ట్రోఫీ.. బుమ్రా సెట్టవ్వకపోతే..

భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…

4 hours ago

మోదీ లేఖతో ‘బండి’కి కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…

4 hours ago

వైరల్ పిక్స్!… సాగు మొదలెట్టిన సాయిరెడ్డి!

వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…

5 hours ago