ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన కొన్ని సినిమాలు దశాబ్దాల తర్వాత రీ రిలీజైతే వాటిని సెలబ్రేషన్ లా చూస్తున్న ప్రేక్షకులు లక్షలు కోట్లలో ఉంటున్నారు. నాగబాబుని నష్టాలపాలు చేసిన ఆరంజ్ గత ఏడాది హౌస్ ఫుల్ బోర్డులతో కిటకిటలాడించింది.
దర్శకుడి కెరీర్ నే తిరబెట్టిన ఓయ్ కొచ్చిన రెస్పాన్స్ చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయింది. తాజాగా రవితేజ నేనింతేని నిన్న థియేటర్లకు తీసుకొచ్చారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సియా గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ డ్రామాకు చక్రి పాటలు చాలా ప్లసయ్యాయి. 2008లో నేనింతే కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
దానికి ప్రధాన కారణం పరిశ్రమకు సంబంధించిన సమస్యలను నేపథ్యంగా చూపించడం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. నిర్మాతల కష్టాలు, హీరోల ప్రెస్టీజ్ కోసం అభిమానులు చేసే వెర్రి చేష్టలు, ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు ఇవన్నీ ఎంత రియలిస్టిక్ గా ఉన్నా జనాలకు ఎక్కలేదు. అందులోనూ హీరోయిన్ ఊహించినంత అందంగా లేకపోవడం మైనసయ్యింది.
కృష్ణనగరే మామ పాట మాత్రం ఓ రేంజ్ ఓ ఊపేసింది. చక్రి ట్యూన్ కి భాస్కర భట్ల సాహిత్యం చక్కగా కుదిరి సినిమా అవకాశాల కోసం కష్టపడే కుర్రాళ్ళ కష్టాలను కళ్ళకు కట్టినట్టు వినిపించాయి. ఇదంతా గతంలో దక్కిన ఫలితం.
నిన్న నేనింతేకు వచ్చిన స్పందన నెక్స్ట్ లెవెల్ లో ఉంది. విజనరీ పూరి అంటూ మూవీ లవర్స్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇప్పటి పరిస్థితులను అప్పట్లోనే అంచనా వేసి సహజత్వానికి దగ్గరగా ఎలా తీశారంటూ ట్వీట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఫేక్ కలెక్షన్లు, రివ్యూలు, పోస్టర్ల గోల, థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ లాంటి ఎన్నో విషయాలు కథలో అంతర్భాగంగా గొప్పగా కుదిరాయని ప్రశంసిస్తున్నారు.
పద్దెనిమిది సంవత్సరాల క్రితం నేనింతే ఎందుకు విజయం సాధించలేదనేది పక్కనపెడితే ఆనాటి వింటేజ్ పూరి జగన్నాథ్ మళ్ళీ బయటికి రావాలని సినీ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్లే కాదు అందరి కోరిక అదేమరి.
This post was last modified on January 27, 2025 10:24 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…