బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద ఇటీవల జరిగిన దాడి వ్యవహారం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దొంగతనం చేయడానికి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తి.. ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేయబోవడం.. ఈ క్రమంలో సైఫ్ అతడితో ఘర్షణ పడడం.. ఈ క్రమంలో సైఫ్ మీద కత్తితో దాడి చేయడంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ ఘటన అనంతరం ఆ వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. సైఫ్ ఆసుపత్రి పాలయ్యాడు.
దాడి జరిగిన మూడు రోజుల తర్వాత షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు పట్టుకుని.. అతనే సైఫ్ మీద దాడి చేసినట్లుగా నిర్ధరించారు. ప్రస్తుతం కేసు విచారణ చురుగ్గా సాగుతోంది. ఇలాంటి సమయంలో ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు ఓ వార్త బయటికి వచ్చింది. సైఫ్ మీద దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించి పట్టుకున్న షరీఫుల్ ఇస్లాం నుంచి వేలిముద్రలు సేకరించిన పోలీసులు.. సైఫ్ ఇంట్లో దొరికిన వేలి ముద్రలతో పోల్చి చూడగా.. రెండూ వేర్వరుగా కనిపిస్తున్నాయట.
దీంతో పోలీసులు పట్టుకుంది అసలైన నిందితుడినేనా.. లేక ఈ కేసులో మరో వ్యక్తి ప్రమేయడం కూడా ఉందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. సైఫ్ ఇంట్లో మొత్తం 19 మంది వ్యక్తుల వేలి ముద్రలను నిపుణుల బృందం సేకరించింది. సైఫ్ కుటుంబ సభ్యులు, పని వాళ్లవి కాకుండా ఉన్న వేలి ముద్రలు వేటితోనూ షరీఫుల్ ఇస్లాం వేలి ముద్రలు సరిపోవడం లేదట.
దీంతో మరోసారి విషయాన్ని నిర్ధరించడం కోసం మళ్లీ వేలి ముద్రల సేకరణ చేపడుతున్నారట. మరి రెండోసారి కూడా నిందితుడి వేలి ముద్రలు అక్కడి వాటితో సరిపోలకపోతే ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
This post was last modified on January 26, 2025 5:43 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…