మహేష్ బాబు 29లో ప్రియాంకా చోప్రా ఫైనల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఖంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆమెనే మెయిన్ హీరోయిననే భావనతో. సాధారణంగా మన భారతీయ సినిమాల్లో హీరో ఎంత వయసు పెద్ద వాడైనా సరే హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా గ్లామరస్ గా చిన్న వయసుదే అయ్యుండాలి.
యువరాజులో మహేష్ పక్కన సిమ్రాన్ నే ప్రేక్షకులు అంతగా అంగీకరించలేకపోయారు. అక్కలా ఉందని ఫీలయ్యారు. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ అయ్యాక మహేష్ మరింత గ్లామరసయ్యాడు. అందుకే ప్రియాంక తన పక్కన ఆనదని అభిమానుల ఫీలింగ్.
ట్విస్ట్ ఏంటంటే అసలు ఇంతకీ ప్రియాంక పాత్ర ఏంటనేది రాజమౌళి టీమ్ కి తప్ప ఎవరికీ తెలియదు. మహేష్ ని ప్రేమించే రెగ్యులర్ తరహాలో ఉండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ డ్యూయెట్లు పెట్టకుండా మేనేజ్ చేసిన జక్కన్న ఇప్పుడు పాత రూట్ లోకి వెళ్ళడు గాక వెళ్ళడు.
కాబట్టి ఇప్పటికిప్పుడు మహేష్, ప్రియాంకలను జంటగా ఊహించుకోవడం అవవసరం. అసలే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. బోలెడు క్యారెక్టర్లు, విదేశీ నటీనటులు ఉంటారు. అలాంటప్పుడు ఎవరికి ఎలాంటి రోల్ డిజైన్ చేశాడనేది జక్కన్న మాత్రమే చెప్పగలడు. సో వెయిట్ చేయాల్సిందే.
అప్పటిదాకా ఊహాగానాలు విని వదిలేయాలి తప్పించి లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. మొదటి షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న రాజమౌళి అదయ్యాక ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ముంబైలోనా లేక హైద్రాబాదా అనేది ఇంకా బయటికి చెప్పడం లేదు.
ట్రిపులార్ లో తారక్ కు విదేశీ భామను సెట్ చేసినట్టు ఇందులోనూ మహేష్ పక్కన ఏదైనా సర్ప్రైజ్ చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గుట్టుగా దాచి ఒక్కసారిగా బ్లాస్ట్ చేయడంలో రాజమౌళి స్టైల్ వేరు. అలాంటప్పుడు వేచి చూడటమే ధోరణే ఉత్తమం. మొదటి భాగమా లేక సీక్వెల్ ఉంటుందా లేదానేది కూడా ఇప్పటికి సస్పెన్స్.
This post was last modified on January 25, 2025 5:50 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…