మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారైనా పోలీస్ పాత్ర చేయాలని అనుకుంటాడు. ఆ పాత్రల్లో ఉండే హీరోయిజం వేరు. వాటికి పడే ఎలివేషన్లు వేరు. టాలీవుడ్లో ఖాకీ పాత్రల్లో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చి మరపురాని విజయాలు అందుకున్న హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకడు. అతను విక్రమార్కుడు, పవర్, క్రాక్ సినిమాల్లో పోలీస్ పాత్రలను ఎంత గొప్పగా పండించాడో.. అవి ఎంత పెద్ద విజయాలు సాధించాయో తెలిసిందే.
మాస్ రాజా పోలీస్ పాత్రలు చేసిన సినిమాల్లో ఒక్క ‘టచ్ చేసి చూడు’ మాత్రమే సరిగా ఆడలేదు. చివరగా ‘క్రాక్’ సినిమాలో పోలీస్ పాత్రను గొప్పగా పండించాడు మాస్ రాజా. ఇప్పుడు మళ్లీ అతను ఖాకీ చొక్కా తొడిగాడు. ‘సామజవరగమన’ రైటర్ భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం కానున్న ‘మాస్ జాతర’లో రవితేజ పోలీస్ పాత్ర చేస్తున్న విషయం వెల్లడైంది. ఈ సినిమా టీజర్ రేపు ఉదయం 11.07 నిమిషాలకు లాంచ్ కాబోతోంది.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ రోజు మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అందులో ఖాకీ డ్రెస్ వేసుకుని స్టైలుగా నడుచుకుని వస్తున్న రవితేజ లుక్ అదిరిపోయింది. ఈ సినిమా కోసం లుక్ మీద మాస్ రాజా ప్రత్యేక దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తుంటే. రవితేజ ఖాకీ డ్రెస్ వేశాడంటే పెర్ఫామెన్స్ అదిరిపోతుందనడంలో సందేహం లేదు. అభిమానులకు కూడా రెట్టించిన ఉత్సాహం వస్తుంది.
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న మాస్ రాజా.. ఈ చిత్రంతో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని భావిస్తున్నారు ఫ్యాన్స్. రవితేజ పోలీస్ పాత్ర చేసినప్పటికీ.. ఈ సినిమా మరీ సీరియస్‌గా ఏమీ సాగదని.. ఎంటర్టైనింగ్‌గా సాగుతుందని అంటున్నారు. వరుస విజయాలతో ఊపుమీదున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందించింది. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on January 25, 2025 4:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…