‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలతో కన్నడ నటుడు యశ్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగిపోయాడో తెలిసిందే. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీగా మార్కెట్ సంపాదించుకున్న సౌత్ హీరోల్లో అతనొకడు. ఐతే తన తర్వాతి చిత్రంపై ఉండే భారీ అంచనాల దృష్ట్యా యశ్ ఆచితూచి అడుగులు వేశాడు. కొత్త చిత్రాన్ని ఓకే చేయడానికి.. దాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి చాలా సమయమే తీసుకున్నాడు.
ఎట్టకేలకు కొన్ని నెలల కిందట తన కొత్త సినిమా ‘టాక్సిక్’ సెట్స్ మీదికి వెళ్లింది. ఐతే మేకింగ్ మొదలై.. సగం చిత్రీకరణ పూర్తయి.. ఇటీవలే టీజర్ సైతం రిలీజైనా సరే.. ఇందులో కథానాయిక పాత్ర పోషించిన కీయారా టీజర్లో కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇందులో నయనతార కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమేనని టీం నుండి లీక్ వచ్చేసింది.
ఈ విషయాన్ని ఇందులో విలన్ పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చూచాయగా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను ప్రస్తుతం యశ్ సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు చెప్పిన వివేక్.. ఈ చిత్రంలో నయనతార నటిస్తోందని హింట్ ఇచ్చాడు. ఇంతకు మించి వివరాలను తాను వెల్లడించలేనని, త్వరలోనే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారన్న వివేక్.. అప్పటి వరకు వేచిచూడాలని అన్నాడు.
ఇప్పటికే హీరోయిన్ గా ఉన్న కియార తో రెండు కీలక షెడ్యూల్స్ షూట్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పుడు అదనంగా సౌత్ టాప్ హీరోయిన్ నయనతార ఎలాంటి పాత్రలో దర్శనమిస్తుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ రిలీజ్ దశగా షూటింగ్ జరుగుతుంది. మరి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారో లేక మరోసారి వాయిదా వేస్తారో వేచి చూడాలి.
This post was last modified on January 25, 2025 8:18 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…