దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన రూపొందించిన గీతాంజలి, నాయకుడు, అంజలి, రోజా, బొంబాయి, సఖి ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే మాస్టర్ క్లాసిక్స్ అయ్యాయి.
తర్వాత కాలంలో ఫామ్ తగ్గిపోయి ఎక్కువ ఫ్లాపులు చవి చూసిన మణిరత్నం దుల్కర్ సల్మాన్ ఓకే బంగారంతో తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టనిపించినా కడలి, చెలియా, నవాబ్ లాంటివి మళ్ళీ వెనక్కు లాగాయి. ఇతర భాషల్లో ఏమో కానీ తమిళంలో గొప్ప విజయం సాధించిన పొన్నియిన్ సెల్వన్ తిరిగి ఈయన్ను ట్రాక్ లోకి తెచ్చి పెట్టింది.
ఇటీవలే కమల్ హాసన్, శింబుతో తగ్ లైఫ్ పూర్తి చేసిన మణిరత్నం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. వేసవి విడుదల కావడంతో దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో త్రిష హీరోయిన్. అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇదయ్యాక మణిరత్నం ఎవరితో చేస్తారనే డౌట్ అందరిలో ఉంది. దళపతి కాంబినేషన్ రిపీట్ చేస్తూ రజనీకాంత్ కు ఒక కథ చెప్పారనే టాక్ ఉంది కానీ అది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పట్టేలా ఉండటంతో ఈ లోగా కొత్త కుర్రాళ్ళు, అమ్మాయిలతో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారట.
ఒకప్పుడంటే మణిరత్నం రొమాన్స్ అద్భుతంగా పండి తెరమీద ఒక కవిత చదువుతున్న భావన కలిగేది. మరి ఈ వయసులో కూడా అదే ఇంపాక్ట్ ఇచ్చేలా ఎలాంటి కథ రాసుకున్నారనేది ఆసక్తికరం. తక్కువ బడ్జెట్ లో వేగంగా పూర్తయ్యేలా ఈ లవ్ ఎంటర్ టైనర్ ఉంటుందని చెన్నై టాక్.
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. తగ్ లైఫ్ వర్క్ చివరి దశలో ఉన్నప్పుడు అనౌన్స్ మెంట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు గ్యాప్ రాకుండా వేగంగా సినిమాలు చేయాలని చూస్తున్న మణిరత్నం తెలుగులోనూ ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ అది నెరవేరే అవకాశాలు లేనట్టే. మన స్టార్ల డేట్లు ఖాళీగా లేవు మరి.
This post was last modified on January 24, 2025 8:30 pm
కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…