ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ కోసం నటుడిగా మారిపోయారు. కానీ డైరెక్టర్ గా ఏదో ఒక రోజు కంబ్యాక్ ఇవ్వకపోతారాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విక్రమ్ హీరోగా ఆయన రూపొందించిన ధృవ నచ్చత్తిరమ్ పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా మోక్షం దక్కించుకోకపోవడం ఆర్థికంగా దెబ్బ కొట్టింది.
దాన్ని బయటికి తీసుకు వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకపోయింది. తాజాగా గౌతమ్ మీనన్ మల్లువుడ్ లో అడుగు పెట్టారు. మమ్ముట్టి హీరోగా డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ తీశారు. నిన్ననే విడుదలయ్యింది.
ఆసుపత్రిలో దొరికిన ఒక మహిళ పర్సు వెనుక గుట్టుని తెలుసుకోవడానికి ఒక మాజీ సిఐ కం డిటెక్టివ్ డామినిక్ చేసే ప్రయత్నమే ఈ సినిమా మూలకథ. పాయింట్ చూస్తే ఏదో గుర్తొస్తోంది కదూ. అవును. నాగార్జున శివమణిలో రక్షితకు బీచ్ లో సీసా దొరికితే దాని వెనుక ఉన్న స్టోరీని తెలుసుకునేందుకు గోవా వెళ్తుంది. కాకపోతే అది లవ్ స్టోరీ.
డామినిక్ లో కామెడీ ప్లస్ సస్పెన్స్ కలగలిపే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి ఎప్పటిలాగే తన అనుభవంతో నెట్టుకురాగా గౌతమ్ తన రెగ్యులర్ స్టైల్ లో నెమ్మదిగా కథనాన్ని నడిపించడం అంత కిక్ ఇవ్వలేకపోయింది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మెప్పించినా అసలు మ్యాటర్ నత్తనడకే.
మలయాళంలో ఇలాంటి స్లో థ్రిల్లర్స్ వర్కౌట్ అవ్వడం సహజమే కాబట్టి హిట్ అవొచ్చేమో కానీ ఇతర ప్రేక్షకులకు మాత్రం డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఆశించిన సంతృప్తిని ఇచ్చే అవకాశం లేదు. అధిక శాతం ఊహించేలా స్క్రీన్ ప్లే జరగడం, బోర్ కొట్టడం ఈ మూవీలోని ప్రధాన మైనస్సులు.
డబ్బింగు, రీమేక్ కి ఛాన్స్ లేనట్టే. ఇది సక్సెస్ అయితే మళ్ళీ ట్రాక్ లో వద్దామనుకున్న గౌతమ్ మీనన్ కు ఆ ఆశ ఎంత మేరకు నెరవేరుతుందో చెప్పలేం. మమ్ముట్టి నటించిన గత థ్రిల్లర్స్ స్థాయిలో సక్సెసయ్యేలా లేదని ట్రేడ్ టాక్. చూస్తుంటే ఈ కల్ట్ దర్శకుడికి ఎదురుచూపులు కొనసాగడం తప్పేలా లేదు.
This post was last modified on January 24, 2025 10:23 pm
వచ్చే నెల ఫిబ్రవరి 14 విడుదల కాబోతున్న చావా మీదున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక రెట్టింపయ్యాయి. విక్కీ కౌశల్ టైటిల్…
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ శుక్రవారం సాయంత్రం బాంబు లాంటి నిర్ణయాన్ని ప్రకటించిన వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శనివారం…
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ…
ఇటీవలే కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దానికొచ్చిన స్పందన చూసి తనకు…
రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానంటూ వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. తన నిష్క్రమణ పర్వంలో మిగిలి ఉన్న కార్యాన్ని కూడా…
క్రికెట్ మ్యాచ్ చివర్లో వచ్చి సెంచరీ కొట్టి గెలిపించిన టైపులో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతూనే ఉంది. పది…