అసలే థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల ఒకపక్క డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. అందుకే నిర్మాతలు ముందు జాగ్రత్తగా ఆలస్యంగా ఒప్పందాలు చేసుకోవడమో లేదా స్ట్రీమింగ్ డేట్ బయటికి రాకుండా జాగ్రత్త పడటమో చేస్తున్నారు. కానీ సరైన ముందస్తు ప్లానింగ్ లేకపోతే సినిమా కిల్ అయిపోతుంది.
తాజాగా విడుదలైన ఐడెంటిటీ దానికి ఉదాహరణగా నిలుస్తోంది. మూడు వారాల క్రితం జనవరి 2 ఈ మలయాళం మూవీ రిలీజయ్యింది. భారీ బ్లాక్ బస్టర్ కాదు కానీ డీసెంట్ టాక్ తో ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించడంతో కొంత ఆలస్యంగా తెలుగులో తెచ్చారు.
టోవినో థామస్, త్రిష, వినయ్ వర్మ లాంటి తెలిసిన క్యాస్టింగ్ ఉండటం వల్ల మన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందన్న ఉద్దేశం కాబోలు ఈ రోజు ఇక్కడ విడుదలయ్యింది. ట్విస్ట్ ఏంటంటే జనవరి 31 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ చేయబోతున్నట్టు జీ 5 అధికారికంగా ఈ రోజే ప్రకటించేసింది. అది కూడా కేవలం ఒరిజినల్ వెర్షన్ మాత్రమే కాదు ప్రధాన భాషల అనువాదాలు కూడా ఉంటాయని ప్రోమోలో పేర్కొంది.
అంటే సరిగ్గా ఏడు రోజులకు ఇంట్లోనే చూసేయొచ్చన్న మాట. ఈ మాత్రం దానికి వ్యయ ప్రయాసలు కూర్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని థియేటర్స్ లో వదలడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఐడెంటిటీ ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. యాక్సిడెంట్ కేసులో కీలక సాక్ష్యంగా నిలిచి జ్ఞాపకశక్తి కోల్పోయిన ఓ అమ్మాయి జీవితంలో ఇద్దరు యువకులు వస్తారు. వీళ్ళ మధ్య జరిగే థ్రిల్లింగ్ విచారణే ఐడెంటిటీ.
పాయింట్ పరంగా ఆసక్తి అనిపించే ఈ సినిమాని పూర్తి స్థాయి ఎంగేజింగ్ గా మలచడంలో దర్శకులు అఖిల్ పాల్ – అనాస్ ఖాన్ పడిన తడబాటు ప్రభావాన్ని తగ్గించింది. సరే ఫలితం సంగతి ఎలా ఉన్నా ఇలా కేవలం వారం గ్యాప్ లో ఇలా సినిమాలు డిజిటల్ లో రావడం వల్ల ఎవరికేం ప్రయోజనమో ఏమో కానీ థియేటర్ కెళ్లే ప్రేక్షకులు ఆగిపోయేలా ఉన్నారు.
This post was last modified on January 24, 2025 3:48 pm
వరుస బ్లాక్ బస్టర్లలో ఊపుమీదున్నాడు నందమూరి బాలకృష్ణ. ఆయన దశ తిరిగేలా చేసిన సినిమా.. అఖండనే. ఆ సినిమా ఎవ్వరూ…
ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ, ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది.…
హెల్దిగా ఉండడం కోసం మనం తీసుకునే ఆరోగ్యకరమైన డైట్ లో సూపర్ఫుడ్స్ను భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాలలో…
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. కేవలం 11…
ఏపీ సర్కారు తరఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్లు దావోస్లో పెట్టుబడులు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో…