Movie News

బాయ్‌కాట్ లక్ష్మీబాంబ్.. ఎందుకు ట్రెండవుతోంది?

ఇంతకుముందు అనేక వివాదాస్పద అంశాల మీద సినిమాలొచ్చేవి. సినిమాల ద్వారా అనేక విషయాలను చర్చించేవాళ్లు. కానీ ఈ మధ్య ఆ పరిస్థితి ఉండట్లేదన్నది వాస్తవం. సోషల్ మీడియా కాలంలో జనాల్లో మరీ సున్నితత్వం పెరిగిపోయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి వివిధ పరిణామాలు చూస్తుంటే. సినిమాల్లో చిన్న చిన్న విషయాల్ని పట్టుకుని పెద్ద వివాదం చేయడం మామూలైపోయింది. బూతద్దం పెట్టి వెతికి మరీ చిన్న విషయాన్ని పట్టుకుని, మనోభావాలు దెబ్బ తీసేసుకుంటున్నారు జనాలు.

ముఖ్యంగా కులం, మతం సంబంధిత విషయాల్లో జనాలు మరీ సున్నితంగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది కొన్ని వ్యవహారాలు చూస్తుంటే. వచ్చే నెలలో దీపావళి కానుకగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తుండటం గమనార్హం.

ఈ ఆందోళన చేస్తున్న వారి తొలి అభ్యంతరం.. సినిమా టైటిల్. లక్ష్మీబాంబ్ అని టైటిల్ పెట్టడం ద్వారా.. లక్ష్మీదేవిని అవమానించిందట చిత్ర బృందం. ఇక రెండో అభ్యంతరం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోకు అసిఫ్ అని, హీరోయిన్‌కు ప్రియా యాదవ్ అని పేర్లు పెట్టడం. ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయికి మధ్య ప్రేమను చూపించి లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ హిందూ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హీరోయిన్‌‌ను ముస్లింగా, హీరోను హిందువుగా చూపించే సాహసం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు అక్షయ్ కుమార్ భారతీయ పౌరుడే కాదని, అతను కెనడియన్ అని కొందరు విమర్శిస్తుంటే.. ఇంకొందరేమో పాకిస్థాన్ అమ్మాయి మలాలాను అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా గతంలో ఇంటర్వ్యూ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. అంతే కాక ఇంతకుముందు ‘ఓ మై గాడ్’ ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ విగ్రహాల మీద పాలు పోసి వృథా చేయడాన్ని తప్పుబట్టాడు. ఆ విషయాలన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ‘లక్ష్మీబాంబ్’ను బహిష్కరించాలంటూ ఉద్యమం చేస్తున్నారు ఓ వర్గం నెటిజన్లు.

This post was last modified on October 17, 2020 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

12 minutes ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

2 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

2 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

2 hours ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

3 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

3 hours ago