Movie News

గేమ్ ఛేంజర్ మీద ఇంకో పిడుగు

భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే ఉన్నాం. రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్డి పైరసీ లీక్ కావడం, దాన్ని ఏకంగా సోషల్ మీడియాతో పాటు బయట పబ్లిక్ ప్లేసుల్లో స్క్రీనింగ్ చేయడం లాంటివి చూసి ఫ్యాన్స్ నివ్వెరపోయారు.

దీని వెనుక నలభై అయిదు మంది ఉన్నారని గుర్తించిన ఎస్విసి బృందం ఆ మేరకు పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, తదుపరి చర్యలకు ఉపక్రమించడం జరిగిపోయాయి. ఇవన్నీ డిజాస్టర్ ఫలితాన్ని మార్చవు కానీ భవిష్యత్తులో ఇతర ప్యాన్ ఇండియా చిత్రాలకు ఒక అలెర్ట్ గా పనికొస్తుంది.

సరే జరిగిందేదో జరిగిందనుకుంటే గేమ్ ఛేంజర్ ఇంకా థియేటర్లలో ఉండగానే తాజాగా 4కె ప్రింట్ బయటికి రావడం అభిమానులను మరోసారి ఖంగారెత్తిస్తోంది. కేవలం 14 రోజులకే ఇలా జరగడం ఎవరూ ఊహించనిది. స్పష్టమైన ఆడియో, వీడియోతో ప్రత్యక్షం కావడం నిజంగా నివ్వెరపోవాల్సిన విషయమే.

దీని వెనుక ఎవరు ఉన్నారనేది తర్వాత తేలుతుంది కానీ రాను రాను హెచ్డి పైరసీ వెర్రి తలలు వేయడం పరిశ్రమకు ఎంత మాత్రం మంచిది కాదు. పుష్ప 2 ది రూల్, మార్కో, సూక్ష్మ దర్శిని, బరోజ్, కంగువ లాంటివి ఓటిటి కన్నా ముందే దీని బారిన పడి నష్టాలను చవి చూశాయి.

థియేటర్ ప్రింట్లు పైరసీ కావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఇలా హెచ్డిల రూపం చాలా ప్రమాదరకమైన పరిణామం. ఇప్పుడు కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో ఇతర నిర్మాతలు ఈ మహమ్మారి బారిన పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు, పరిశ్రమ సమన్వయంతో పని చేస్తే తప్ప పరిష్కారం దొరకడం కష్టం. జరగండి జరగండి పాట నుంచి గేమ్ ఛేంజర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి.

ఆఖరికి విడుదలయ్యాక కూడా అదే రిపీట్ కావడం విషాదం. బాక్సాఫీస్ రన్ పూర్తి కావడానికి దగ్గరగా ఉన్న తరుణంలో గేమ్ చేంజర్ మీద మరో పిడుగు పడటం గోరుచుట్టు మీద రోకలిపోటు లాగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

This post was last modified on January 24, 2025 11:08 am

Share

Recent Posts

మోదీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం

వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…

15 minutes ago

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

1 hour ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

2 hours ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

5 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

7 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

7 hours ago