Movie News

పుష్ప-2… బీజీఎం గొడవ ఇంకా సమసిపోలేదా?

పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన ప్రతి సినిమాకూ సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తూ వచ్చిన దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమాకు మాత్రం పూర్తి స్థాయిలో పని చేయలేకపోయాడు. అతడికి ఖాళీ లేదో.. లేక తన వర్క్ నచ్చలేదో కానీ.. రిలీజ్ ముంగిట బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ కోసం తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్.. ఇలా ముగ్గురిని తీసుకున్నాడు సుకుమార్.

ముగ్గురికీ కొన్ని సీన్లు అప్పగించడం.. వాళ్లు ఔట్ పుట్ ఇవ్వడం.. చివరికి తమన్, అజనీష్‌ల వర్క్ పక్కన పెట్టి సామ్ సీఎస్ స్కోర్ మాత్రం తీసుకుని సినిమాలో కొన్ని సన్నివేశాలకు వాడుకోవడం తెలిసిందే. దీనిపై దేవిశ్రీ తన అసహనాన్ని ఓ ఈవెంట్లో వెళ్లగక్కేశాడు. అతడి పట్టుదల వల్లే టైటిల్ కార్డ్స్‌లో సంగీతం, నేపథ్య సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అని ప్రత్యేకంగా వేశారు. సామ్ సీఎస్‌కు ‘అడిషనల్ బీజీఎం’ అని క్రెడిట్ ఇచ్చారు.

ఐతే సినిమాలో చాలా వరకు దేవిశ్రీ స్కోరే వాడారని.. పరిమితంగా కొన్ని సన్నివేశాలకు మాత్రమే సామ్ వర్క్ తీసుకున్నారని యూనిట్ వర్గాలు చెప్పాయి. టైటిల్ కార్డ్స్ చూసినా ఇదే విషయం అర్థమైంది. కానీ సామ్ మాత్రం సినిమాలో 90 శాతం సన్నివేశాలకు తన స్కోరే వాడారని ఓ ఇంటర్వ్యూలో క్లైమ్ చేసుకున్నాడు. కానీ ఇది నమ్మశక్యంగా అనిపించలేదు. సామ్ తన వర్క్ గురించి ఎక్కువ చేసి చెప్పుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో సామ్ మళ్లీ ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. ‘పుష్ప-2’ కోసం తాను ఎంత వర్క్ చేసింది చూపించడానికా అన్నట్లు ఈ సినిమా నుంచి ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీంతో మళ్లీ పుష్ప-2 బీజీఎం గొడవ మళ్లీ రాజుకున్నట్లు అయింది. మరి సినిమాలో ఉపయోగించిన తన వర్క్‌నే ఓఎస్టీ రూపంలో సామ్ రిలీజ్ చేస్తాడా.. లేక తాను టీంకు పంపిన ట్రాక్స్ విడుదల చేస్తాడా అన్నది ఆసక్తికరం.

మొత్తానికి అతను రిలీజ్ చేసే ఓఎస్టీని బట్టి సినిమాలోని బీజీఎంలో తన పాత్ర ఎంత అన్నది జనాలకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

This post was last modified on January 23, 2025 7:56 pm

Share

Recent Posts

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

3 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

7 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

8 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

9 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

10 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

10 hours ago