డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ సాధించిన సిద్దు జొన్నలగడ్డ కొంచెం గ్యాప్ తీసుకున్నట్టు కనిపించినా తర్వాత చాలా బిజీ అయిపోయాడు. ముందుగా ఏప్రిల్ 10న జాక్ తో వస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో సిద్దు రొమాంటిక్ ప్రపంచానికి దూరంగా కనిపించబోతున్నాడు.
తర్వాత నీరజ కోన డైరెక్షన్ లో తెలుసు కదా ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో కోహినూర్ వచ్చే ఏడాది విడుదలను టార్గెట్ చేసుకుంటోంది. ఇప్పుడు మరో కాంబో కుదిరిందని సమాచారం.
గత ఏడాది ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకుడు పరశురామ్ ఇటీవలే సిద్దు జొన్నలగడ్డకు చెప్పిన కథ ఓకే అయిపోయి ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతున్నట్టు ఫిలిం నగర్ న్యూస్. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.
ఫ్యామిలీ స్టార్ డిజాస్టరయ్యాక మరో సినిమా చేయాలని అప్పట్లోనే రాజు, పరశురామ్ మధ్య అంగీకారం కుదిరింది. కాకపోతే హీరోని సెట్ చేసుకోవడంలో జరిగిన ఆలస్యం వల్ల ఇంత టైం పట్టింది. బ్యాక్ డ్రాప్ ఏదనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఎంటర్ టైన్మెంట్ జానరేనని టాక్. గీతా గోవిందం టైపులో క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట.
సో లేట్ అయినా పరశురామ్ మంచి ఛాన్స్ పట్టేసినట్టే. మహేష్ బాబుతో సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ఈ దర్శకుడికి ఫ్యామిలీ స్టార్ మీద చాలా నమ్మకం ఉండేది. కానీ ట్రీట్మెంట్ లో జరిగిన తేడా వల్ల ప్రేక్షకులు ఆదరించలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వడం లేదట.
తన బ్యానర్ లో ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు ఇంకో ఆఫర్ ద్వారా దిల్ రాజు గతంలో హిట్లు కొట్టిన దాఖలాన్నాయి. వంశీ పైడిపల్లి, వేణు శ్రీరామ్ అలా బ్రేక్ తెచ్చుకున్నవాళ్ళే. మరి పరశురామ్ కూడా అదే కోవలోకి చేరతారేమో చూడాలి. స్క్రిప్ట్ లాక్ చేసుకుని వేసవి నుంచి షూటింగ్ మొదలుపెట్టొచ్చని తెలిసింది.
This post was last modified on January 23, 2025 6:03 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…