‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత తన స్థాయికి సినిమాలు చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ మినహాయిస్తే ఆయన తర్వాతి చిత్రాలేవీ సంతృప్తికర ఫలితాలు అందుకోలేకపోయాయి. ముఖ్యంగా ఆచార్య, భోళా శంకర్ ఫలితాలు చిరు, ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేనివే. చిరు ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి నవతరం దర్శకులతో పని చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
వారి ఆకాంక్షలకు తగ్గట్లే వశిష్ఠ, శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లాంటి నవతరం దర్శకుల సినిమాలను లైన్లో పెట్టాడు మెగాస్టార్. ఇందులో వశిష్ఠతో చేస్తున్న ‘విశ్వంభర’ చివరి దశలో ఉంది. ఇక మిగతా రెండు చిత్రాలు ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తాయన్నదే తేలాల్సి ఉంది. శ్రీకాంత్ చిత్రమే ముందు అనౌన్స్ చేశారు కాబట్టి అదే మొదలవుతుందేమో అనుకున్నారు కానీ.. అది వాస్తవం కాదని తెలుస్తోంది.
ప్రస్తుతం నానితో ఓ సినిమా చేస్తున్న శ్రీకాంత్.. అది పూర్తయ్యాక చిరు సినిమాను ఆరంభించడానికి టైం పడుతుంది. ఈలోపు అనిల్ రావిపూడితోనే చిరు సినిమా ఉండబోతోంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అనిల్ స్క్రిప్టు, మేకింగ్ రెండింట్లోనూ చాలా ఫాస్టుగా ఉంటాడు. చిరు సినిమాను ఇంకో మూడు నెలల్లోనే అతను మొదలుపెట్టేయనున్నాడట. కాబట్టి ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్.. వచ్చే ఏడాది చిరు సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడన్నమాట.
ఈ సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ఒక స్పెషల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మహా శివరాత్రికి ఈ టీజర్ లాంచ్ అవుతుందని అంటున్నారు. ‘జైలర్-2’ తరహలోనే ఒక అనౌన్స్‌మెంట్ టీజర్‌ను స్పెషల్‌గా షూట్ చేయనున్నారట. ప్రస్తుతం కాన్సెప్ట్ రెడీ చేసే పనిలో అనిల్ ఉన్నాడని.. త్వరలోనే దాని చిత్రీకరణ జరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది.
This post was last modified on January 23, 2025 5:33 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…