10 సంవత్సరాల హిట్ మెషీన్ : అనిల్ రావిపూడి

ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర నుంచి జంధ్యాల, కొరటాల వరకు అందరికీ ఇది అనుభవమే. కానీ కొందరు మాత్రమే దీనికి మినహాయింపుగా నిలిచి కొత్త చరిత్ర సృష్టిస్తారు. వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఎస్ఎస్ రాజమౌళి అయితే ఆ తర్వాత నిలిచేది అనిల్ రావిపూడి.

పది సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే జనవరి 23న కళ్యాణ్ రామ్ ‘పటాస్’ రిలీజయ్యింది. ఒక పోలీస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇలా కూడా తీయొచ్చాని డెబ్యూ డైరెక్టర్ నిరూపించిన తీరు మాస్ ప్రేక్షకులతో ఘనవిజయం అందించింది.

చిరంజీవి మేనల్లుడుగా ఎదుగుతున్న దశలో ఉన్న సాయి ధరమ్ తేజ్ తో ‘సుప్రీమ్’ లాంటి మాస్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో పాటు రావిపూడికి అవకాశాలను తీసుకొచ్చింది. కళ్ళు లేకుండా ఒక స్టార్ హీరో మీద మాస్ అంశాలతో కథ రాసుకోవడం చాలా రిస్క్. అయినా సరే నెరవేరకుండా రవితేజ ‘రాజా ది గ్రేట్’ తీసిన వైనం చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది.

వెంకటేష్ లోని ఒరిజినల్ కామెడీ టైమింగ్ ని పూర్తిగా వాడుకుంటూ వరుణ్ తేజ్ ని మరో హీరోగా పెట్టి ‘ఎఫ్2’ కొట్టిన సక్సెస్ ఎన్నో రికార్డులు సాధించింది. ఇవన్నీ చూసి కోరిమరీ ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబుకి ‘సరిలేరు నీకెవ్వరు’తో అత్యధిక గ్రాసర్ ఇవ్వడం ఫ్యాన్స్ మర్చిపోలేరు.

బాహుబలి, కెజిఎఫ్ లాంటి గ్రాండియర్లకు మాత్రమే సీక్వెల్స్ వర్కౌట్ అవుతున్న ట్రెండ్ లో ‘ఎఫ్3’తో దాన్ని తిరగరాయడం అనిల్ రావిపూడి కెరీర్ లో మరోమలుపు. బాలకృష్ణ వయసుకు తగ్గట్టు హీరోయిజం ఎక్కడా తగ్గకుండా ఆడపిల్లల పెంపకానికి సంబందించిన సందేశం ఇస్తూనే అందించిన ‘భగవంత్ కేసరి’ మరో మైలురాయి.

తిరిగి తన ఎంటర్ టైన్మెంట్ జానర్ కు తిరిగి వచ్చి రావిపూడి అందించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వారంలోపే వంద కోట్ల షేర్ వసూలు చేయడం ఇంకో హిస్టరీ. ఇలా అప్రతిహతంగా ఇన్నేసి విజయాలు సాధించడమంటే మాములు విషయం.

ఇక్క చెప్పిన సినిమాలన్నింటిలోనూ వినోదం పాలు తగ్గకుండా చూసుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్ సీక్రెట్. పటాస్ లో మెయిన్ పాయింట్ చాలా సీరియస్ గా ఉంటుంది. అయితే విలన్ మీద రివెంజ్ పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా చూపించడం దగ్గరే తన ప్రత్యేకత చూపించడం మొదలుపెట్టాడు.

ఈవివి సత్యనారాయణ, జంధ్యాల, ఎస్వి కృష్ణారెడ్డి లాంటి వాళ్ళను రీ ప్లేస్ చేస్తూ కొత్త తరం కామెడీ డాక్టర్ గా మారిపోయిన అనిల్ రావిపూడి ఇంత ప్రతిభ ఉంది కాబట్టే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ కొట్టేశాడు. చూస్తుంటే ఈ క్రియేటివ్ హిట్ మెషీన్ లో ఎప్పటికీ ఇంధనం అయిపోదేమో.