దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం మేకర్స్ పోటాపోటీగా తయారైన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ను లీడ్ రోల్‌లో పెట్టి ‘తలైవి’ అనే భారీ చిత్రం తీశారు. మరోవైపు గౌతమ్ మీనన్ డైరెక్షన్లో రమ్యకృష్ణతో ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ సైతం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కించింది. వీటికి పోటీగా మరోవైపు నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో ‘ది ఐరెన్ లేడీ’ పేరుతో ప్రియదర్శని అనే దర్శకురాలు మరో సినిమాను ప్రకటించారు.
ఈ సినిమా కోసం నిత్య కొన్ని రోజులు వర్క్ షాప్‌లో సైతం పాల్గొంది. లుక్స్ పరంగా చూస్తే జయలలిత పాత్రకు నిత్యానే పర్ఫెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నటిగా కూడా ఆమె ప్రతిభ ఎలాంటిదో తెలిసిందే. ఐతే ఇక సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో ఈ చిత్రం గురించి వార్తలు ఆగిపోయాయి. ఐదేళ్లయినా ఏ అప్‌డేట్ లేదు.
ఈ చిత్రం ముందుకు కదలకపోవడానికి కారణాలేంటో నిత్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘జయలలిత బయోపిక్ చేయాలని మేం ఎంతో ఆశపడ్డాం. చర్చలు జరిగాయి. కానీ మా సినిమా ప్రకటించాక అదే కథతో ‘తలైవి’ అనే సినిమా వచ్చింది. మేం కూడా అదే కథతో సినిమా చేస్తే రిపీటవుతుంది కదా అని సందేహించాం. కానీ మా నాన్న మాత్రం జయలలిత బయోపిక్‌లో కచ్చితంగా నటించమని అడిగారు. మేం ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. ఇంకొన్ని రోజులకే ‘క్వీన్’ పేరుతో వెబ్ సిరీస్ కూడా వచ్చింది.
అలా ఒకే కథపై రెండు ప్రాజెక్టులు వచ్చాక మేం సినిమా చేస్తే కచ్చితంగా రిపీట్ అవుతుందని అనుకున్నాం. అందుకే ఎంతో ఇష్టపడి చేయాలనుకున్న సినిమాను ఆపేశాం’’ అని నిత్యా మీనన్ తెలిపింది. ఇటీవల నిత్య కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ప్రస్తుతం ధనుష్ సరసన నిత్య ‘ఇడ్లీ కడై’ సినిమా చేస్తోంది.
This post was last modified on January 22, 2025 2:33 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…